Tag Archives: black beads

Surekha Vani: నుదిటిన బొట్టు మెడలో నల్లపూసలతో సందడి చేసిన సురేఖ వాణి… వైరల్ అవుతున్న ఫోటోలు!

Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు.ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ముఖ్యంగా ఈమె తన కుమార్తె సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు.పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులిస్తుంటారు. ఇక నిత్యం పబ్ లకువెళ్తూ పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీరి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో కొన్నిసార్లు వీరి వ్యవహార శైలి కారణంగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో నెటిజన్లో ట్రోలింగ్ కి గురైనప్పటికీ వీరు మాత్రం వీరు వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోలేదు. అయితే తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె నిండు ముత్తైదువులా నుదుటిన కుంకుమ మెడలో నల్లపూసలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

Surekha Vani: సాంప్రదాయాలు మర్చిపోయావా…

ఈ ఫోటోలో క్షణాల్లో వైరల్ కావడంతో కొందరు ఏంటి సురేఖ వాణి రెండు పెళ్ళికి సిద్ధమైనదా అంటూ కామెంట్లు చేయగా మరికొందరు భర్త చనిపోయిన ఇలా నిండు ముత్తైదువుల తయారవడంతో సాంప్రదాయాలు మర్చిపోయావా సురేఖ వాణి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. భర్త చనిపోయిన సినిమా సెలబ్రిటీలు సినిమాలలో నటించే సమయంలో పాత్ర డిమాండ్ చేస్తే ఇలా తయారు కావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే సురేఖ వాణి ఏదైనా పాత్ర కోసం ఇలా తయారయ్యారా అనే విషయం తెలియదు కానీ ఈమె మాత్రం ఇలా ముత్తైదువుల తయారు కావడంతో అభిమానులు భారీగా ట్రోల్ చేస్తున్నారు.

మంగళ సూత్రంలో పొరపాటున కూడా పిన్నీసులు వేసుకోకూడదు ఒకవేళ వేస్తే..?

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పెళ్లైన తరువాత స్త్రీ మెడలో ఎల్లప్పుడు మంగళ సూత్రాలను ధరించి ఉంటారు. మన భారతదేశంలో జరిగే వివాహాలలో మొదటి ప్రాధాన్యత మాంగల్యానికి ఉంటుంది. ఈ విధంగా మన దేశ ఆచార వ్యవహారాలు ఇతర దేశాలకు ఎంతో నిదర్శనంగా ఉంటాయని చెప్పవచ్చు. పెళ్లి అయిన స్త్రీ భర్త అడుగుజాడల్లో, తన తోడునీడగా నడుస్తుంది. తన భర్త ఆరోగ్యంగా దీర్ఘాయుష్షు ఆ మంగళసూత్రంలో ఉంటుందని భావిస్తోంది.

ఇంత ప్రాముఖ్యత ఉన్న మంగళ సూత్రాలను ప్రస్తుత కాలంలో ఒక ఆభరణంగా మాత్రమే ధరిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మంగళ సూత్రాలలో పిన్నీసులు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. ఈ విధంగా పిన్నీసులు పెట్టుకోవడం ద్వారా మంగళ సూత్రాలకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం ఏర్పడుతుంది. ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మంగళసూత్రానికి రావడం వల్ల ఆ భార్య భర్తల దాంపత్య జీవితంలో మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. అందుకోసమే మంగళసూత్రాలలో పిన్నీసులు వేసుకోకూడదని చెబుతుంటారు.

మంగళ సూత్రాలను ఎంతో పరమపవిత్రంగా పూజించుకోవాలి. అప్పుడే ఆ మహిళ నిండు ముత్తైదువ గా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో మంగళ సూత్రాలను నల్లపూసలలో ధరించి వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా నల్లపూసలలో మంగళ సూత్రం ధరించడం కూడా మంచి పద్ధతి కాదని పండితులు తెలియజేస్తున్నారు.మన హిందూ సాంప్రదాయాలలో పాటించే ప్రతి ఒక్క కార్యం వెనుక అర్థం పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి ఆచార నియమాలను పాటించడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.