Tag Archives: boundary

MS Dhoni: గిల్ క్రిస్ట్ ను బౌండరీ వరకు పరుగులు పెట్టించిన ధోని… అసలేం జరిగిందంటే?

MS Dhoni: భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యద్భుతమైన కెప్టెన్, టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనుడు, ఫినిషర్ గా ఎన్నో రికార్డులు అందించిన ఘనత ధోనీకి చెల్లుతుందని చెప్పాలి. ఇలా ఇండియాని ముందుకు నడిపించడంలో ధోని ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకుంటారు.

సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోనికి ఎవరు సాటిరారు.ధోనీ మైండ్ లో ఏముంటుంది అనేది తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఇలా ధోని తీసుకున్న నిర్ణయంతో ఒకసారి రిక్కీ పాంటింగ్ బకరాని చేయక అదే మ్యాచ్లో గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరిగెత్తించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్పటి వీడియో వైరల్ గా మారింది.

గతంలో ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లిన సందర్భంగా ఓ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ధోనీని కట్టడి చేసేందుకు రికీ పాంటింగ్ 8 మంది ఫీల్డర్స్ ని మోహరించాడు. ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడే ధోనీ ఏం చేస్తాడా అని స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ధోని ఏం చేస్తారని ఆత్రుతగా చూస్తున్నారు.ఇక జాన్సన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని.. ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడిన ధోనీ లైగ్ సైడ్ కొట్టాడు.

MS Dhoni: గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేసిన పాంటింగ్…

అటువైపు ఫీల్డ్స్ ఎవరూ లేకపోవడంతో వికెట్ కీపర్ గా ఉన్నటువంటి గిల్ క్రిస్ట్ బౌండరీ వరకు పరుగెత్తి బాల్ పట్టుకున్నాడు. అయితే అదే సమయంలోనే ధోని ఏకంగా మూడు పరుగులు చేశారు. దీంతో పిచ్చెక్కిపోయినా రికీ పాంటింగ్ ఎందుకు పరిగెత్తావు అంటూ గిల్ క్రిస్ట్ పై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.