Tag Archives: Boys Hostel movie

Nagachaitanya: ఖుషి ట్రైలర్ చూసి బయటకు వచ్చిన చైతు…. వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో!

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకున్న తరువాత కూడా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలవుతుంది అయినప్పటికీ వీరి కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి తరచూ ఏదో ఒక వార్త చెక్కరలు కొడుతూనే ఉంటుంది.

ఇకపోతే తాజాగా నటి సమంతా ఖుషి సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత భార్య భర్తలుగా నటించారని చెప్పాలి.ఇకపోతే ఖుషి సినిమా ట్రైలర్ చూసి నాగచైతన్య ఆవేశంతో బయటకు వచ్చారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఇటీవల సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వచ్చిన బాయ్స్ హాస్టల్ సినిమా ఈనెల 26వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదల ముందు ప్రీమియర్ షో వేశారట. ఈ ప్రీమియర్ షో చూడటానికి నాగచైతన్యను కూడా ఆహ్వానించారు. అయితే ఈ షో చూస్తున్న సమయంలోనే ఖుషి సినిమా ట్రైలర్ రావడంతో ఈయన కోపంతో బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై స్పందించిన నాగచైతన్య అదంతా అవాస్తవమని తెలియజేశారు.

Nagachaitanya: కావాలని సృష్టించిన రూమర్లు….

ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నాగచైతన్య ఈ విషయం గురించి స్పందిస్తూ..తాను థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు, కావాలని సృష్టించిన రూమర్స్. ఈ ఫేక్ న్యూస్ గురించి నా దృష్టికి వచ్చింది. దీనితో సదరు మీడియాకి ఆ వార్తలని సరి చేయమని సూచించినట్లు నాగచైతన్య వెల్లడించారు.