Tag Archives: bridegroom

Jabardasth Varsha: నిశ్చితార్థానికి సిద్ధమైన జబర్దస్త్ వర్ష…. పెళ్ళికొడుకు ఎవరో తెలుసా… వైరల్ అవుతున్న వీడియో!

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ వర్ష ఒకరు.ఈమె కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి స్కిట్లు చేయడంతో ఒక్కసారిగా ఈ జోడీకి మంచి పాపులారిటీ వచ్చింది. ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఈవెంట్లలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం బుల్లితెర నటీనటులు ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన వీడియోలన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా వర్షా కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను నిశ్చితార్థానికి సిద్ధమయ్యానని వరుడు ఎవరో తెలుసా అంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ విధంగా వర్ష నిశ్చితార్థానికి సిద్ధమయ్యాను అంటూ వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులందరూ షాక్ అయ్యారు ఏంటి వర్షా కూడా పెళ్లికి సిద్ధమయ్యారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఈమె నిశ్చితార్థానికి సిద్ధమయ్యాను అని చెప్పడంతో అది తన నిశ్చితార్థం కాదని, రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతల నిశ్చితార్థానికి తాను సిద్ధమయ్యానని చెప్పుకొచ్చారు.

Jabardasth Varsha: గ్లామరస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న వర్ష…

ఇకపోతే ఈ వీడియో ద్వారా ఈమె తాను కూడా త్వరలోనే నిశ్చితార్థం జరుపుకోబోతున్నాను అంటూ హింట్ కూడా ఇచ్చారు ప్రస్తుతం సుజాత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మధ్యకాలంలో వర్షం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో ఈమె అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు.