Tag Archives: BTech

బీటెక్ అయిపోయిన ఆర్ఆర్ఆర్ విడుదల కాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నెటిజన్లు.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన చిత్రబృందం!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల పై సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి కామెంట్ చేశారు. ఈ సందర్భంగా స్పందిస్తూ నేను డిప్లమో చదివేటప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నేను బీటెక్ పూర్తి చేసిన సినిమా విడుదల కాలేదు అంటూ కామెంట్ చేశారు.

ఇలా నెటిజన్ చేసిన కామెంట్ కు చిత్రబృందం స్పందిస్తూ అదిరిపోయే సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ నువ్వు కాలేజీకి వెళ్లినన్ని రోజులు కూడా మేము షూటింగ్ చేయలేదు ఏం చేస్తాం మరి అంటూ అదిరిపోయే కామెంట్ చేశారు. ప్రస్తుతం వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వాయిదా వేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 7వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఈ పాటలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ చేసిన డాన్స్ కి ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారి సినిమాపై అంచనాలను పెంచుతుంది.

నిరుద్యోగులకు శుభవార్త.. ఐబీపీఎస్ 647 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..!

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో జరిగే పోటీ పరీక్షలు ఈ సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా విజృంభణ తగ్గడంతో ఐబీపీఎస్ 647 ఉద్యోగాలను సీఆర్పీ(కామన్ రికూట్మెంట్ ప్రాసెస్) ద్వారా భర్తీ చేయనుంది. లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్ల ఉద్యోగులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఈ నెల 23వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికవుతారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2021 జనవరి 24వ తేదీన మెయిన్ పరీక్ష జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 175 రూపాయలు, మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో ఐటీ ఆఫీసర్లు 20, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 485, రాజ్ భాష అధికారి 25, లా ఆఫీసర్ 50, హెచ్.ఆర్ 7, మార్కెటింగ్ ఆఫీసర్ 60 ఉద్యోగాలు ఉన్నాయి. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ఐబీపీఎస్ ఈ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.