Tag Archives: buffalo

New Business: ముర్రా జాతి గేదెలతో ఎన్నో రకాల ఉపయోగాలు..ఆ గేదె గురించి ఇక్కడ తెలుసుకోండి..!

New Business: బిజినెస్ చేయాలని ఆలోచించే వాళ్లు ఇక్కడ చెప్పే ఓ బిజినెస్ మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర భారతదేశంలో కంటే.. దక్షిణ భారతదేశంలో వాతావరణ పరిస్థితులు బిన్నంగా ఉంటాయి.

New Business: ముర్రా జాతి గేదెలతో ఎన్నో రకాల ఉపయోగాలు..ఆ గేదె గురించి ఇక్కడ తెలుసుకోండి..!

దక్షిణ భారతదేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా.. ముర్రా జాతి గేదెలు ఉంటాయి. అంతే కాదు.. ఈ బర్రెలు అనేక రకాల వ్యాధులకు తట్టుకోగలవు. దాదాపు ఈ జాతి గేదెలు 16 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

New Business: ముర్రా జాతి గేదెలతో ఎన్నో రకాల ఉపయోగాలు..ఆ గేదె గురించి ఇక్కడ తెలుసుకోండి..!

అందుకే ముర్రా జాతి గేదెలు ఎక్కువ ధర పలుకుతాయి. వీటి ధర దాదాపు రూ. 60 వేల నుంచి రూ. లక్ష 30 వేల వరకు ఉంటుంది. వీటి రంగు, కొమ్ములు మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

గేదెల గర్భావతి కాలం దాదాపు సంవత్సరం వరకు..

దీని శరీరం మొత్తం దాదాపు 500 కిలోల బరువు ఉటుంది. ఆడ గేదె అయితే దాదాపు 450కిలోల వరకు ఉంటుంది. ఇటువంటి గేదెలను కొని పెంచుకుంటే.. ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపు ఈ పాల ద్వారా నెలకు రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ముర్రా జాతి గేదెల సగటు వయస్సు దాదాపు 11 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ గేదెల గర్భావతి కాలం దాదాపు సంవత్సరం వరకు ఉంటుంది. అంటే.. 310 రోజుల వరకు ఉంటుంది. దీని పాలలో కొవ్వు శాతం అనేది ఆవు పాలల్లో ఉండే కొవ్వు శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. 6.5 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుంది. ఇవి నిశబ్ద వేడిని కలిగి ఉంటాయి. ఇలా ఇంటి వద్దే ఉంటూ.. రాబడి రాబట్టాలంటే.. ఈ బిజినెస్ ఎంతో బాగుంటుంది. ఇలాంటి బిజినెస్ చేసేవాళ్లు గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు.

అమ్మబాబోయ్.. ఒక్క దున్నపోతు ధర రూ.24 కోట్లు.. దానికి కూడా ఏ స్పెషల్ ఉందండోయ్..

మనకు తెలిసి ధర ప్రకారం.. ఒక దున్నపోతు ఎంత పలుకుతుంది రూ.లక్ష లేదా రూ.3 లక్షలు. లేదా దానికి ఇంకా మరేదైనా స్పషల్ ఉంటే దాదాపు రూ.10 లక్షలకు విక్రయించవచ్చు. కానీ రాజస్థాన్ రాష్ట్ర జోద్ పూర్ లో పుష్కర్ ఫెయిర్ అనేది ప్రతీ సంవత్సరం జరుగుతుంది. దీనిలో పశువుల సంత కూడా ఒక భాగం. వేలాది పశువులను ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. మరి కొంతమంది వాటిని కొనుక్కొని తీసుకెళ్తుంటారు.

ఈ ప్రదర్శనలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ దున్న. ముర్రా జాతికి చెందిన ఆ దున్న ఎత్తు ఆరడుగులు. పొడువు 14 అడుగులు. బరువు 1500 కిలోలు. దానిని అర్వింద్ జంగిడ్ అనే ఆఫ్ఘన్ షేక్ ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. ఆ దున్నను భీమ్ అని పిలుచుకుంటామని, దాని ఖరీదు రూ.24కోట్లు అని తెలిపారు. కానీ దానిని అమ్మేది లేదని ఆయన చెప్పారు. కేవలం ముర్రే జాతి దున్నలను కాపాడుకునేందుకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.

ప్రదర్శన తర్వాత తాను ఇక్కడ నుంచి తీసుకెళ్తానన తెలిపాడు. సాధారణ జాతి గేదెలు రోజుకు 7-10 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయని అర్వింద్ జంగిడ్ తెలిపారు. ముర్రా జాతి గేదెలు తొలి కాన్పు తర్వాత 15-16 లీటర్లు, రెండు-మూడు కాన్పుల అనంతరం 20 లీటర్లకు పైగా పాలు ఇస్తాయని వివరించారు. సందర్శన కోసం మాత్రమే వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. అయితే దీని వీర్యానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు.
దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయన్నారు.

ఐదారు దేశాల నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయయన్నాడు. భీమ్ సంతతిని ఉత్పత్తి చేయాలనుకున్న వారు దాని వీర్యం తీసుకెళ్తుంటారు. ఆ వీర్యం ద్వారా వచ్చే ఆదాయమే రూ.కోట్లలో ఉంటుందని పేర్కొన్నాడు. వీర్యం ద్వారానే అతడు రూ.కోట్లల్లో సంపాదిస్తున్నాడు.. ఇక దానిని ఎలా అమ్మాతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటు పాల ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయన్నారు.

బర్రెపై అత్యాచారం.. చివరకు కామాంధుడికి అనూహ్య ఘటన..

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలకు ఎన్ని రక్షణ చట్టాలు తెచ్చినా ఉపయోగం లేకుండా పోతున్నాయి. వాయివరుసలు మరిచి చిన్న, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ ఓ కామాంధుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు.

అంతటి అవమానీయ ఘటన వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో చోటుచేసుకుంది. జరిగింది ఏటంటే.. వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేశారు. అయినా బుద్ధి మారలేదు. మళ్లీ అతడు అదే పని చేశాడు. ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది.

దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై షేక్‌ షఫీ వివరాల ప్రకారం అతడు కూలీ పనికి వెళ్తుంటాడని చెప్పారు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక అతడి మెడకు గట్టిగా బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు.

పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.