మనకు తెలిసి ధర ప్రకారం.. ఒక దున్నపోతు ఎంత పలుకుతుంది రూ.లక్ష లేదా రూ.3 లక్షలు. లేదా దానికి ఇంకా మరేదైనా స్పషల్ ఉంటే దాదాపు రూ.10 లక్షలకు విక్రయించవచ్చు. కానీ రాజస్థాన్ రాష్ట్ర జోద్ పూర్ లో పుష్కర్ ఫెయిర్ అనేది ప్రతీ సంవత్సరం జరుగుతుంది. దీనిలో పశువుల సంత కూడా ఒక భాగం. వేలాది పశువులను ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. మరి కొంతమంది వాటిని కొనుక్కొని తీసుకెళ్తుంటారు.
ఈ ప్రదర్శనలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ దున్న. ముర్రా జాతికి చెందిన ఆ దున్న ఎత్తు ఆరడుగులు. పొడువు 14 అడుగులు. బరువు 1500 కిలోలు. దానిని అర్వింద్ జంగిడ్ అనే ఆఫ్ఘన్ షేక్ ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. ఆ దున్నను భీమ్ అని పిలుచుకుంటామని, దాని ఖరీదు రూ.24కోట్లు అని తెలిపారు. కానీ దానిని అమ్మేది లేదని ఆయన చెప్పారు. కేవలం ముర్రే జాతి దున్నలను కాపాడుకునేందుకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.
ప్రదర్శన తర్వాత తాను ఇక్కడ నుంచి తీసుకెళ్తానన తెలిపాడు. సాధారణ జాతి గేదెలు రోజుకు 7-10 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయని అర్వింద్ జంగిడ్ తెలిపారు. ముర్రా జాతి గేదెలు తొలి కాన్పు తర్వాత 15-16 లీటర్లు, రెండు-మూడు కాన్పుల అనంతరం 20 లీటర్లకు పైగా పాలు ఇస్తాయని వివరించారు. సందర్శన కోసం మాత్రమే వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. అయితే దీని వీర్యానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు.
దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయన్నారు.
ఐదారు దేశాల నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయయన్నాడు. భీమ్ సంతతిని ఉత్పత్తి చేయాలనుకున్న వారు దాని వీర్యం తీసుకెళ్తుంటారు. ఆ వీర్యం ద్వారా వచ్చే ఆదాయమే రూ.కోట్లలో ఉంటుందని పేర్కొన్నాడు. వీర్యం ద్వారానే అతడు రూ.కోట్లల్లో సంపాదిస్తున్నాడు.. ఇక దానిని ఎలా అమ్మాతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటు పాల ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…