అమ్మబాబోయ్.. ఒక్క దున్నపోతు ధర రూ.24 కోట్లు.. దానికి కూడా ఏ స్పెషల్ ఉందండోయ్..

0
67

మనకు తెలిసి ధర ప్రకారం.. ఒక దున్నపోతు ఎంత పలుకుతుంది రూ.లక్ష లేదా రూ.3 లక్షలు. లేదా దానికి ఇంకా మరేదైనా స్పషల్ ఉంటే దాదాపు రూ.10 లక్షలకు విక్రయించవచ్చు. కానీ రాజస్థాన్ రాష్ట్ర జోద్ పూర్ లో పుష్కర్ ఫెయిర్ అనేది ప్రతీ సంవత్సరం జరుగుతుంది. దీనిలో పశువుల సంత కూడా ఒక భాగం. వేలాది పశువులను ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. మరి కొంతమంది వాటిని కొనుక్కొని తీసుకెళ్తుంటారు.

ఈ ప్రదర్శనలో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ దున్న. ముర్రా జాతికి చెందిన ఆ దున్న ఎత్తు ఆరడుగులు. పొడువు 14 అడుగులు. బరువు 1500 కిలోలు. దానిని అర్వింద్ జంగిడ్ అనే ఆఫ్ఘన్ షేక్ ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. ఆ దున్నను భీమ్ అని పిలుచుకుంటామని, దాని ఖరీదు రూ.24కోట్లు అని తెలిపారు. కానీ దానిని అమ్మేది లేదని ఆయన చెప్పారు. కేవలం ముర్రే జాతి దున్నలను కాపాడుకునేందుకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.

ప్రదర్శన తర్వాత తాను ఇక్కడ నుంచి తీసుకెళ్తానన తెలిపాడు. సాధారణ జాతి గేదెలు రోజుకు 7-10 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయని అర్వింద్ జంగిడ్ తెలిపారు. ముర్రా జాతి గేదెలు తొలి కాన్పు తర్వాత 15-16 లీటర్లు, రెండు-మూడు కాన్పుల అనంతరం 20 లీటర్లకు పైగా పాలు ఇస్తాయని వివరించారు. సందర్శన కోసం మాత్రమే వీటిని తీసుకొస్తామని పేర్కొన్నారు. అయితే దీని వీర్యానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు.
దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయన్నారు.

ఐదారు దేశాల నుంచి అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయయన్నాడు. భీమ్ సంతతిని ఉత్పత్తి చేయాలనుకున్న వారు దాని వీర్యం తీసుకెళ్తుంటారు. ఆ వీర్యం ద్వారా వచ్చే ఆదాయమే రూ.కోట్లలో ఉంటుందని పేర్కొన్నాడు. వీర్యం ద్వారానే అతడు రూ.కోట్లల్లో సంపాదిస్తున్నాడు.. ఇక దానిని ఎలా అమ్మాతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటు పాల ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here