Featured

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్ ఆంటోనీ జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నాయో తెలుసా?

విజయ్ ఆంటోనీ… ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయి జీవించడానికే అష్టకష్టాలు పడ్డ విజయ్ సినిమా ప్రపంచం లో అడుగుపెట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈయన మొదటగా సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాతగా సినీ ఇండస్ట్రీ లో పని చేసారు. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఇక ఈయన జీవిత నేపథ్యం చూస్తే…

తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ ‌కోయిల్ ‌లో 1975 జూలై 24న జన్మించాడు. అతని తండ్రి మరణించేనాటికి అతని వయస్సు 7 సంవత్సరాలు అయితే, అతని సోదరి వయస్సు 4 సంవత్సరాలు. దింతో అతని కుటుంబం కష్టాలకు గురి అయింది. అతని తల్లి పిల్లలకు విద్యను అందించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేది. ఇక విజయ్ ఆంటోనీ లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు.

ఇకపోతే విజయ్ ఆంటోని చిన్నప్పటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొని తన నటనా నైపుణ్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, ఎవరి సినీ కుటుంబ నేపథ్యం ఉన్న ఇళ్లలో పుట్టకపోయినా… సినిమాల్లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పుడే తన తండ్రి మరణించడంతో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇకపోతే అతను తన అమ్మని, తల్లిని చెల్లిని కలుసుకోవడానికి వారంలో ఒకసారి మాత్రమే అవకాశం ఉండేదని, అందుకు గల కారణం వారికి అద్దె ఇంట్లో దొరక్కపోవడం. ఇక తన తల్లి ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని చదువుతున్న సమయంలో తన తల్లికి వేరే ఊరు ట్రాన్సఫర్ అయినా సరే… తన పిల్లల చదువు మానిపించడం ఇష్టం లేక ఉన్నచోటి నుండి ప్రతిరోజు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని చేశారు.

అలాంటి సమయంలో తన తల్లికి 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఆ శిక్షణ తరగతులను హాజరయ్యేందుకు తన తల్లి తనని హాస్టల్లో ఉంచి చదివిందని, చెల్లిని మాత్రం తనతో తీసుకు వెళ్లిందని తెలిపాడు. అయితే అనుకోకుండా తన తల్లి హాస్టల్ లో వదిలి వెళ్ళిన తర్వాత రెండు రోజులకు హాస్టల్ కు సెలవు ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అతను, ఆ హాస్టల్ వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థులు ఉండే శిబిరంలో తాను కూడా తలదాచుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో విజయ్ ఆంటోని కి చిల్లిగవ్వ కూడా చేతిలో లేకపోవడంతో, దీంతో ఆయన ఆ సమయంలో కేవలం అరటి పండ్లు తింటూ జీవనాన్ని కొనసాగించారు.

అప్పుడు అంతా కష్టపడి తన జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రస్తుతం హీరోగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత తన తొలి చిత్రం 2012 లో “నాన్” అయినప్పటికీ, అతను సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాదు ఉత్తమ సంగీత విభాగంలో “నాక ముక్క” అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్. ఈ పాట ద్వారా అతను బాగా గుర్తింపు పొందాడు. ఇక విజయ్ ఆంటోనీ వివాహం సైతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక యువతీ విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్భం లో ఆమెతో ప్రేమలో పడి 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి లారా అని ఒక కూతురు కూడా ఉంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago