Tag Archives: bumchick bablo

Bumchick Babloo: సీక్రెట్ గా ప్రేయసిని పెళ్ళి చేసుకున్న బమ్‌చిక్‌ బబ్లు… ఫోటోలు వైరల్!

Bumchick Babloo: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది తమ టాలెంట్ ను బయట పెడుతూ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకున్నారు.ఇలా యూట్యూబ్‌లో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి.. గుర్తింపు తెచ్చుకున్న వారిలో బమ్ చిక్ బబ్లూ ఒకరు. బబ్లూ మాయ అనే యూట్యూబ్‌ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ సందడి చేస్తున్నారు.

Bumchick Babloo: రహస్యంగా ప్రేయసిని పెళ్ళి చేసుకున్న బమ్‌చిక్‌ బబ్లు… ఫోటోలు వైరల్!

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బబ్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

Bumchick Babloo: రహస్యంగా ప్రేయసిని పెళ్ళి చేసుకున్న బమ్‌చిక్‌ బబ్లు… ఫోటోలు వైరల్!

సాధారణంగా ఎంతో మంది ప్రస్తుత కాలంలో వారి కుటుంబానికి సంబంధించి ఏదైనా చిన్న వేడుక జరిగినా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరితో పంచుకుంటారు. అలాంటిది బబ్లు తన పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోకుండా ఏకంగా పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

రహస్యంగా ఆర్యసమాజ్ లో పెళ్లి…

ఇక ఈ ఫోటోలను షేర్ షేర్ చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు అసలు బబ్లు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆ అమ్మాయి బబ్లు ప్రియురాలు శ్రీవల్లి అని తెలుస్తోంది. బబ్లు తాను ప్రేమించిన అమ్మాయిని ఆర్యసమాజ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకొని తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్‌ అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.