Bumchick Babloo: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది తమ టాలెంట్ ను బయట పెడుతూ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు దక్కించుకున్నారు.ఇలా యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి.. గుర్తింపు తెచ్చుకున్న వారిలో బమ్ చిక్ బబ్లూ ఒకరు. బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ సందడి చేస్తున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బబ్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
సాధారణంగా ఎంతో మంది ప్రస్తుత కాలంలో వారి కుటుంబానికి సంబంధించి ఏదైనా చిన్న వేడుక జరిగినా వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరితో పంచుకుంటారు. అలాంటిది బబ్లు తన పెళ్లికి సంబంధించిన ఏ విషయం కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోకుండా ఏకంగా పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.
ఇక ఈ ఫోటోలను షేర్ షేర్ చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు అసలు బబ్లు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆ అమ్మాయి బబ్లు ప్రియురాలు శ్రీవల్లి అని తెలుస్తోంది. బబ్లు తాను ప్రేమించిన అమ్మాయిని ఆర్యసమాజ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకొని తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ జీవితంలో కొత్త చాప్టర్‌కి చీర్స్ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…