Ester Noronha: నోయల్ మాజీ భార్య, నటి ఎస్తర్ గురించి అందరికీ తెలిసిందే.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన “69 సంస్కార్ కాలనీ”ఈ సినిమా ద్వారా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నటి
ఎస్తర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఎస్తర్ నటించిన 69 సంస్కార్ కాలనీ సినిమాలో ఈమె ఒక కుర్రాడితో రొమాన్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది.
ఈ ట్రైలర్ చూసిన ఎంతో మంది హీరోయిన్ ది తప్పు అంటూ ఇలాంటి సినిమాలలో నటించి సమాజానికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు అంటూ దారుణంగా ఈమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటూ ట్రోల్ చేయడంపై నటి స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం మగవారికి మాత్రమే కోరికలు ఉంటాయా ఆడవారికి ఉండవా అంటూ ఘాటుగా స్పందించారు. ఈ మూవీలో నాతో పాటు అబ్బాయి కూడా నటించారు. మరీ ఆ అబ్బాయిని ఎవరు ప్రశ్నించడం లేదే. కేవలం నన్ను మాత్రమే ట్రోల్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. సమాజంలో అమ్మాయిలకు ఒక న్యాయం అబ్బాయిలకు ఒక న్యాయం ఉంటుందా. సమాజంలో ఏం జరిగినా అది కేవలం అమ్మాయిదే తప్పు అన్నట్టు చూపిస్తారు.ఇక రీసెంట్‌గా ఇండస్ట్రీలో అన్‌ప్రొఫెషనల్ ట్రాక్స్ తాను చాలా చూశానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…