Tag Archives: business ideas

రూ.50 వేలు పెట్టుబడి పెట్టండి.. నెలకు రూ.కోటికి పైగా సంపాదించండి.. ఆ బిజినెస్ ఏంటంటే.. !

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చాలామంది అనుకుంటారు. అలాంటి బిజినెస్ కోసం వెతుకుతూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ ఓ అద్బుతమైన బిజినెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ.50 వేల పెట్టుబడితో నెలకు రూ.కోటి వరకు సంపాదించొచ్చు. ఆ బిజినెస్ ఏంటంటే.. ఆన్​లైన్​ హోర్డింగ్​ బిజినెస్. ​బిజినెస్ చేసే వాళ్లు ఎవరైనా తన కంపెనీ గురించి అందరికీ తెలియాలని.. మార్కెటింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు.

అలాంటి వారికి హోర్డింగ్ ల ద్వారా కూడా మార్కెటింగ్ చేయాలని అనుకుంటారు. వారి కోసమే ఈ ఐడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వెబ్​సైట్ ను ఏర్పాటు చేసుకొని అందులో సిటీలోని ఆయా ప్రాంతాల్లో హోర్డింగులు పెట్టడానికి పక్కా స్థలాన్ని గుర్తించాలి. కస్టమర్​ మీ వెబ్​సైట్​లో లాగిన్​ అయినపుడు ఆ స్థలాన్ని బుక్​ చేసుకుంటారు.

అపుడు ఆ స్థలం వారికి మీరు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. వారు ఓకె అన్న తర్వాత కస్టమర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయొచ్చు. ఇలా రెండు వైపుల కమీషన్ తో సంపాదించొచ్చు. ఇలాగే గోహోర్డింగ్స్​.కామ్ వ్యవస్థాపకురాలు దీప్తి అవస్థీ శర్మ 2016లో రూ.50 వేలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రూ. కోట్లల్లో సంపాదిస్తున్నారు.

దీనిపై ఆమె మాట్లాడుతూ.. 2016 లో డిజిటల్ హోర్డింగ్‌ల వ్యాపారాన్ని చాలా తక్కువ మొత్తంలోరూ. 50 వేలతో ప్రారంభించానని.. ఈ ఆలోచన విజయవంతమైందని అన్నారు. వారికి స్థలాన్ని చూపించినందుకు కొంత కమీషన్.. స్థలం ఉందని వాళ్లకు తెలియజేసినందుకు మరో కమీషన్ ఇలా రెండు వైపులా కమీషన్ రావడంతో డబ్బులు సంపాదించినట్లు తెలిపారు.

సరికొత్త ఆలోచన.. నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న మహిళ.. ఎలాగంటే?

గత రెండు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో చాలామందికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టువంటి ఒక సాధారణ గృహిణి చేసిన ఆలోచన ఇప్పుడు ఆమెను ఉన్నతమైన వ్యాపారిగా నిలబెట్టింది.కేవలం రెండు లక్షలతో పెట్టుబడి పెట్టిన ఆ మహిళ ప్రస్తుతం నెలకు 2 లక్షలు లాభాన్ని పొందుతుంది. ఇంతకీ ఆ మహిళ చేసిన వ్యాపారం ఏమిటి? ఆమె విజయం వెనుక దాగిఉన్న ఆలోచన ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

హీనా యోగేష్ భేడా అనే మహిళకు 15 ఏళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే వీరి పెద్ద బాబుకు 7 వారాలు తొందరగా జన్మనివ్వడంతో అతడు పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే హీన తన కొడుకులో ఏ విధంగా ఇమ్యూనిటీని పెంచాలనే ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలన్నీ మన బామ్మలు చెప్పిన వనమూలికల వైపు మళ్ళాయి.

ఈ క్రమంలోనే హీన వన మూలికల గురించి అధ్యయనం చేపట్టింది. తన కొడుకులా మరెవరూ బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే హీనా అడుగు ముందుకు వేసింది.
గిలాయ్, అశ్వగంధ,మోరింగ పై ప్రయోగాలు చేసింది. ఈ విధంగా వనమూలికలలో దాగి ఉన్న శక్తిని మన శరీరం లోకి ప్రవేశించాలంటే టీ పొడి ద్వారా మాత్రమే వీలవుతుందని భావించిన ఈమె టీ పొడిలో కెఫిన్ లేకుండా తయారుచేసింది.

ఇలా వివిధ రకాల ఉత్పత్తులను చేసి రెండు లక్షల పెట్టుబడితో యువ సౌల్ అనే వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే హీనా తయారుచేసే ఈ ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో ప్రస్తుతం హీన మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తూ తన వ్యాపారాన్ని విస్తరించింది. మొదటి నెలలో కేవలం 20 వేలు లాభం రాగా ఇలా నెలనెలా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం నెలకు 2.5 లక్షల లాభాన్ని పొందుతోంది.త్వరలోనే ఆన్లైన్ ద్వారా తన ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

ఆ ఘటన తన జీవితాన్నే మార్చింది.. ఓ మహిళ అ విజయ గాధ..!

ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఉన్నారు. అయితే వీరిలో కొందరు వారసత్వంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఇంతటి స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా కేవలం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు తన వ్యాపారాన్ని ఇతర దేశాలలో వ్యాపింపజేసే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు
కృతిక కుమరన్.

ఈమె పుట్టి పెరిగింది తమిళనాడులోని గోబిచెట్టిపాలయం అనే పట్టణంలో.తమిళనాడు తప్ప మరో రాష్ట్రం తెలియని కృతికకు 21 సంవత్సరాలకు పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు. ఈ క్రమంలోనే కృతిక తల్లి మంజులాదేవి తీవ్రమైన చర్మ సమస్యలతో బాధ పడేది.ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు స్టెరాయిడ్లు ఇచ్చేవారు. అధికంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడై ఆమె మరణించారు. ఈ విధంగా తల్లి మరణం కృత్తికను ఎంతో కృంగదీసింది.తన తల్లి లాగా మరొకరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో చేసిన ఆలోచన నుంచి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది.

ఆ ఐడియానే ఆర్గానిక్ సబ్బులు తయారు చేయడానికి అడుగులు వేసింది. తన తల్లి మరణానికి కారణం సభ్యులే అని తెలుసుకున్న కృతిక సహజసిద్ధంగా సభ్యులను తయారుచేయాలని భావించింది. ఈ క్రమంలోనే సహజసిద్ధంగా లభించే నూనెలు, మేక పాల సహాయంతో సభ్యులను తయారుచేసింది.తాను తయారు చేసిన సభ్యులను తమ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు ఉచితంగా ఇచ్చింది. అయితే అది మంచి ఫలితాలను చూపించటంతో ఆమె వ్యాపారానికి కొత్త దారిని పరిచయం చేసింది.

నేచురల్ కాస్మెటోలజీ కోర్స్‌లో చేరి వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకొని తన ఇంటిని ఒక ప్రయోగశాలగా మార్చి ఉత్పత్తులను తయారుచేసింది. ఈ విధంగా తాను తయారు చేసిన ఉత్పత్తులను 2017 వ సంవత్సరంలో విల్వా స్టోర్ ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.ఈ విధంగా ఈమె తయారు చేసిన సబ్బులలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజసిద్ధంగా లభించే నూనె మేక పాలతో తయారు చేయడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.

ప్రస్తుతం కృతిక సబ్బులలో మాత్రమే కాకుండా.. షాంపూలు, క్లీనర్స్, టోనర్,మాస్కులు, మాయిశ్చరైజర్లు, జెల్స్, లిప్ బామ్స్, కంటి ఉత్పత్తులను తయారు చేసే వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా సొంత వెబ్ సైట్ తో పాటు, అమెజాన్,నైకాలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారం ఇతర దేశాలకు పాకింది.ప్రస్తుతం తాను ఇంతటి విజయాన్ని సాధించింది అంటే తన విజయం వెనుక తన తల్లి దీవెనలు ఉన్నాయని కృతిక తెలిపారు.

రూ.5 వేల పెట్టుబడితో..రూ.30 వేల ఆదాయం.. ఎలాగంటే?

చాలామందికి వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలకు లక్షలు పెట్టుబడి కావాలని భావించి వెనుకడుగు వేస్తుంటారు. అయితే వ్యాపారం చేయాలంటే లక్షలు పెట్టుబడి అవసరం లేదు.. కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో 30 వేల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా కేవలం రూ.5 వేలతోనే అధిక లాభాలను పొందే వ్యాపారాలు కూడా ఉన్నాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం..

మనదేశంలో చాలామంది ప్రజలు నీళ్ల తర్వాత తాగే పానీయాలలో టీకి ప్రాధాన్యత ఉంది. అందుకోసమే మనదేశంలో చాలా ప్రాంతాలలో తేయాకును సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీ పొడికి కూడా మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా అస్సాం, డార్జిలింగ్ టీ పొడికి భారీ డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మీరు వ్యాపారం చేయాలని భావిస్తే తక్కువ పెట్టుబడితో ఈ టీ పొడి వ్యాపారం చేస్తే నెలకు వేలల్లో లాభాన్ని పొందవచ్చు.

ముందుగా 5000 లేదా 10000 పెట్టుబడి పెట్టి టీ పొడి ని కొనుగోలు చేసి దీనిని మీరు రిటైల్ లేదా హోల్ సేల్ గా అమ్మవచ్చు. హోమ్ డెలివరీ, జనాలు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, థియేటర్ల వద్ద కూడా వీటిని అమ్ముతూ మంచి లాభాలను పొందవచ్చు. ఈ విధంగా తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను పొందే చిన్న వ్యాపారాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

వ్యాపారం చేయడమే మీ కల అయితే అందుకు పెట్టుబడి డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి ముద్రణ పథకం ద్వారా రుణాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా రూ.50000 మంచి సుమారు 10 లక్షల వరకు రుణాన్ని పొంది మీ వ్యాపార కలను నెరవేర్చుకోవచ్చు.

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో రూ.2 లక్షలు సంపాదించే ఛాన్స్..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధి లేక సొంతూళ్లకు వచ్చి ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల వ్యాపారం చేయాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక బిజినెస్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సులభంగా సంపాదించవచ్చు.

రోజురోజుకు మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో కూడా పుట్టగొడుగులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంటి దగ్గరే సులువుగా పుట్టగొడుగులను పెంచి ఆదాయం పొందవచ్చు. మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉండే పుట్టగొడుగులు కిలో 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ధర పలుకుతాయి.

మనకు శరీరానికి అవసరమైన విటమిన్లు అన్నీ పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి. కంపోస్ట్ సహాయంతో ఇంటి దగ్గరే సులభంగా పుట్టగొడుగులను పెంచడం సాధ్యమవుతుంది. క్వింటాల్ కంపోస్ట్ సహాయంతో సులువుగా కేజిన్నర పుట్టగొడుగులను పెంచవచ్చు. కేజీ 120 నుంచి 170 మధ్య అమ్మినా పెట్టుబడి పోతే రెండు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలు మిగులుతుంది.

ట్రేలలో సాగు చేసే పుట్టగొడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వ్యాపారం చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది.