Tag Archives: calcium

కాక్టస్ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలు.. ఆ జ్యూస్ ని వంటింట్లోనే ఇలా తయారు చేయండి..

ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతుంటారు. అది నిజమే.. ఆరోగ్యంగా లేకపోతే ఏ పని చేయలేం. మానవ శరీరానికి ఎన్నో పోషకాలను అందించే కాక్టస్ మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాక్టస్ లోని చపాతీ అనే ఒక రకం కాక్టస్ రసం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇక్కడ చెప్పిన విధంగా.. ఈ చపాతీ కాక్టస్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
దీనిలో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి.

కాల్షియం , మెగ్నీషియం , బీటా కారోటీన్ , అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ సి, విటమిన్ బి మరియు ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు దీనిలో ఉంటాయి. ఈ రసం అనేది పలు దుకాణాలాల్లో కూడా దొరుకుతుంది. అయితే ఈ జ్యూస్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ కాక్టస్ ముళ్లను తీసి.. బాగా కరిగించిన నీటిలో దీనిని వెయ్యాలి.

5 నిమిషాల వరకు ఉడకబెట్టిన తర్వాత దానిని ఆ నీళ్ల నుంచి తీసేసి మళ్లీ చన్నీళ్లలో ముంచాలి. అనంతరం కాక్టస్ స్కిన్ ని తీసి.. చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలతో పాటు మరి కొన్ని కొంచెం నిమ్మ, ఆరెంజ్ జ్యూస్, కొబ్బరి నీళ్ళు కలిపి మిక్సీ వేసుకోవాలి.

ఆ తర్వాత వాటిని ఉడకపెడితే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇది బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. అయితే ఈ జ్యూస్ తాగడం వల్ల కొంతమందిలో విరేచనాలు, నీరసం సమస్యలు వస్తాయి. అందరికీ రాకపోవచ్చు.. ఏదేమైనా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అనేది మంచిది.

జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారా.. సోంపుతో ఇలా చెయ్యండి..?

సోంపు అంటే మన భాషలో చాలామంది ఒక్కపొడి అని కూడా అంటారు. ఇవి చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాలలోనే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా ముఖ్యంగా బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి.

బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావడానికి మరియు నోటిలో ఏమైనా వాసన లాంటివి వస్తే వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ సోంపు గింజలను ఉపయోగిస్తారు. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, పైల్స్, ఆమ్లత్వం, వాయువు వంటి సమస్యలను అధిగమిస్తారు. నిద్రసరిగ్గా పట్టని వాళ్లు ఈ సోంపు తినడం ద్వారా వెంటనే నిద్ర పడుతుంది.

నిద్రకు ఎక్కువగా ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్. దీనిని తినడం ద్వారా మెలటోనిన్ స్రవించడానికి పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దగ్గు, ఆయాసం మరియు జలుబు తగ్గడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. 10 గ్రాముల సోంపు గింజలను 250 మిల్లి లీటర్ల నీటిలో కలిసి గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత వడబోసి 100 మి. లీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించాలి.

ఇలా చేయటం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం అనేవి మాయం అయిపోతాయి. అలా కాకుంటే.. సోంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి ఉంచి రోజుకి రెండుపూటల పూటకు అర టీ స్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, ఆయాసం మన దరి చేరవు.

కీళ్ల నొప్పులు తగ్గించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలు..!

ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కీళ్లనొప్పుల సమస్య.వయసుతో తారతమ్యం లేకుండా అతి చిన్న వయస్సు నుంచి ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇందుకు గల కారణం ఎముకలలో క్యాల్షియం లోపం కావచ్చు.లేదా మారుతున్న మన ఆహారపు అలవాట్లు జీవన శైలి కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే ఒక్క సారిగా ఈ కీళ్లనొప్పుల బారిన పడితే వాటి నుంచి కోలుకోవడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ కీళ్ల నొప్పులకు ఎలాంటి మందులు వాడినా కేవలం కొంత సమయం వరకు మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి విముక్తి పొందడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటితోపాటు తాజా పండ్లు, కూరగాయలను వారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న చోట వెల్లుల్లిరసంతో బాగా మర్దన చేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వీలయినంతవరకు మాంసానికి దూరంగా ఉండడం ఎంతో మంచిది. ఎక్కువగా చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారపదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు సరైన ఆహారం తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కీళ్లనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.