Tag Archives: careful

ఉదయం అల్పాహారంగా వీటిని తినడం.. అయితే జాగ్రత్త..!

మనలో చాలా మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. మరికొంతమంది అయితే ఉదయం అల్పాహారం సమయంలో ఏదైనా ఒక పండును తీసుకుని మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు.కానీ పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా ఆ పండ్లను పరగడుపున తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారానికి బదులుగా పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇక్కడ తెలుసుకుందాం…

ఉదయం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు అరటి పండును తీసుకోవడం వల్ల వాంతులు అయ్యే సూచనలు ఉంటాయి.అదేవిధంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను పరిగడుపున తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు ఏర్పడతాయి. సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా మన జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది.మనం ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకున్నప్పుడు మన జీర్ణాశయంలో సిట్రస్ జాతి పండ్లు నుంచి విడుదలయ్యే యాసిడ్, జీర్ణాశయం విడుదలచేసే యాసిడ్ మోతాదు ఎక్కువ అవ్వడం వల్ల అసిడిటీ సమస్య ఏర్పడుతుంది.

ఉదయం అల్పాహారంలో పండ్లను సలాడ్ రూపంలో కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సలాడ్లు తాగిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయం ఎన్ని పనులు ఉన్నప్పటికీ అల్పాహారం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో షుగర్ లెవెల్స్, రక్తపోటు స్థాయిలు హెచ్చుతగ్గులు అవటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.