Tag Archives: carrot juice

మహిళలు రోజు ఒక గ్లాస్ పచ్చి క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్యలకు దూరం కావచ్చు..?

అత్యధిక పోషక విలువలు ఉన్న క్యారెట్ ను చాలామంది పచ్చిగా తినటానికి ఇష్టపడతారు.
దుంపజాతి కాయకూర అయిన క్యారెట్ ను రోజువారీ ఆహారంలో ఏ రూపంలో తీసుకున్నా మన శరీరానికి అవసరమైనన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు క్యారెట్ ను రోజు వారి ఆహారంలో తీసుకోవడం తప్పనిసరి.క్యారెట్ ను ఆహారంలో తీసుకోవడంతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

క్యారెట్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కావున ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలోని క్యాన్సర్ కణాలు నశించి భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ప్రమాదకర బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

క్యారెట్స్‌లో పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్స్
సమృద్ధిగా లభిస్తాయి. దాంతో చర్మ సమస్యలు తొలగి సహజ కాంతి వంతమైన చర్మం ఈ సొంతం.క్యారెట్స్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండడంతో కంటి చూపును మెరుగు పరిచి ప్రమాదకర రేచీకటి వంటి వ్యాధులను దూరం చేస్తుంది.క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఎసిడిటీ వంటి జీర్ణవ్యవస్థ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల క్యారెట్ల‌లో ఉండే విట‌మిన్ బి6 ,కె, పొటాషియం,పాస్ఫ‌ర‌స్ వంటివి మన శరీరానికి సమృద్దిగా లభిస్తాయి. దాంతో ఎముకలు దృఢంగా మారి భవిష్యత్తులో వచ్చే కీళ్ల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందుకోసమే ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.