Tag Archives: chia seed

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ లడ్డు తినండి!

ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. శారీరక శ్రమ విషయంలో ఎలాంటి వ్యాయామం చేయకపోవడంతో బరువు పెరిగిపోతున్నారు. దీంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి వివిధ రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొందరు బరువు తగ్గడం లేదు. బరువు తగ్గాలని అనుకునే వారు ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలతో సహా ఇతర పోషకాలు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బరువును అతి వేగంగా తగ్గాలనుకునే వారికి పలు రకాల గింజలను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా చియా, గుమ్మడికాయ, అవిసె గింజలు, పుచ్చకాయ మొదలగునవి ఉన్నాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో బరువు నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజలతో కొద్దిగా బెల్లంను లడ్డూల్లాగా తయారు చేసుకొని తినాలి. దీంతో ఆకలి వేయకుండా ఉండటంతో శరీరంలో ఎక్కువ కొవ్వు చేరకుండా ఉంటుంది.

అయితే ఈ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలంటే.. అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు గింజలను కప్పు చొప్పున తీసుకోవాలి.. అతేకాకుండా నెయ్యిని ఆఫ్ కప్పు, రెండు కప్పుల ఓట్స్, కప్పు బెల్లం మరియు ఎండిన పండ్లను తీసుకోవాలి. ముందుగా గింజలను ఓ గిన్నెలో తీసుకొని వేడి చేయాలి. గింజలను చల్లార్చి వాటితో పాటు వేడి చేసిన నెయ్యిని కలపాలి.

తర్వాత ఓట్స్ బాగా వేయించిన అనంతరం దానిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, బెల్లం పొడి జోడించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కదిలిస్తూ.. బెల్లం పాకం బాగా కలిసే వరకు చూడాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లార్చాలి. దీనిలో చల్లార్చిన విత్తనాలను ఇందులో వేసి చేతులకు నెయ్యి పూసుకొని లడ్డూలను తయారు చేయాలి. ఈ లడ్డూలను ఉదయం, సాయంత్రం రెండు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే లావు తగ్గే అవకాశం ఉంటుంది.