Tag Archives: child actress

Arundhati Movie: చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించిన ఈ బాలనటి ఇప్పుడేం చేస్తుంది.. ఎలా ఉందో తెలుసా?

Arundhati Movie: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు చిన్నప్పటి పాత్రలలో నటించడానికి చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇలా కొన్ని సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతారు. ఇలా గుర్తుండి పోయే వారిలో అరుంధతి సినిమాలో చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం అరుంధతి. ఈ సినిమాలో అరుంధతి చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నారి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది.ఈ సినిమాలో ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ చిన్నారి ఎవరు ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందనే విషయానికి వస్తే…

అరుంధతి సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో నటించిన చిన్నారి పేరు దివ్య నగేష్. అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలతో దివ్య నగేష్ ఎంతో బిజీగా ఉన్నారు.

Arundhati Movie: మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న దివ్య నగేష్..

ఇక తెలుగులో కూడా ఈమె నేను నాన్న అబద్దం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనంతరం ఈమె మలయాళంలో సినిమాలు చేస్తూ వుండిపోయారు. అయితే ఈమె తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈమె ఫోటోలు చూసి అరుంధతి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టా అని ఆశ్చర్యపోతున్నారు.