Arundhati Movie: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు చిన్నప్పటి పాత్రలలో నటించడానికి చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇలా కొన్ని సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతారు. ఇలా గుర్తుండి పోయే వారిలో అరుంధతి సినిమాలో చిన్నప్పటి అరుంధతి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం అరుంధతి. ఈ సినిమాలో అరుంధతి చిన్నప్పటి పాత్రలో నటించిన చిన్నారి ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది.ఈ సినిమాలో ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ చిన్నారి ఎవరు ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందనే విషయానికి వస్తే…
అరుంధతి సినిమాలో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో నటించిన చిన్నారి పేరు దివ్య నగేష్. అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలతో దివ్య నగేష్ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక తెలుగులో కూడా ఈమె నేను నాన్న అబద్దం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనంతరం ఈమె మలయాళంలో సినిమాలు చేస్తూ వుండిపోయారు. అయితే ఈమె తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈమె ఫోటోలు చూసి అరుంధతి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టా అని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…