Tag Archives: coconut water

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

Coconut water: ప్రకృతి అందించిన దివ్యజౌషధం కొబ్బరి. కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనిషికి ఏదో ఓ రకంగా ఉపయోగపడేదే. కొబ్బరి నీళ్లు మనిషి ఆరోగ్యానికి జౌషధంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లుతాగితే గుండెకు సంబంధించి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. జీవక్రియ రేటు పెరగడమే కాకుండా… బరువు తగ్గుతారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. 

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

జ్వరం.. లేదా ఎదైనా సమస్యలు వచ్చినా.. పరామర్శించేందుకు వచ్చేవారికి ముందుగా గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాలే. అంతగా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని కొబ్బరికి పేరుంది. కొబ్బరి నీళ్లలో ఉంటే ఖనిజాలు.. శరీరానికి శక్తినిస్తాయి. 

Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొబ్బరి నీరును తీసుకునే కొన్ని సందర్భాల్లో ఇవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలాగే సరైన సమయంలో కాకుండా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొబ్బరి నీటిని తీసుకుంటే… సమస్యలు ఏర్పడుతాయి. 

ఈ సమస్యలు ఉంటే..కొబ్బరి నీరు తీసుకోవద్దు:

జలుబు ఉన్నవారు రాత్రిళ్లు కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు. అలాగే కడుపులో సమస్యలు ఉన్నవారు కూడా .. కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి. శరీరంలో నీటిని పెంచి విరేచనాలకు కారణం అవుతుంది. కొందరికి ప్రతీసారి జలుబు చేస్తుంది. వీరు చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. కొబ్బరినీరు చల్లగా ఉండటంతో.. మళ్లీ జలుబు పెరిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటుకు మందులు వాడే వారు కొబ్బరీ నీరు ఎక్కువగా తాగకూడదు. ఇందులో రక్తపోటును తగ్గించే గుణాలు ఉంటాయి. దీని వల్ల తక్కువ రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి.

ఈ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..జాగ్రత్త సుమీ!

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం. నిజానికి కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని అంటుంటారు. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.

వేసవికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో మాంగనీస్ మరియు శరీరానికి మేలుచేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రమాదం.

జలుబు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొబ్బరి నీళ్ళలో ఉండే చలవ వల్ల జలుబు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.కొబ్బరి నీళ్లలో బీపీని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారు మందులు వాడుతూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లో-బిపి పెరిగే ప్రమాదం ఉంది. కావున బిపి ఉన్న వాళ్ళు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు.

కడుపులో ఏదైనా సమస్యలు ఉన్న వారు కానీ, లేక ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ కొబ్బరి నీళ్లు తాగకూడదు . ఒకవేళ తాగాలనుకుంటే వైద్యుని సలహా తప్పనిసరి. పొట్ట ఉబ్బరం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.

చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా..?

చాలామంది చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే ఆరోగ్యానికి ప్రమాదమని చెబుతూ ఉంటారు. అయితే అలా వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. వేసవికాలంతో పాటు చలికాలంలో కూడా కొబ్బరినీళ్లను తాగవచ్చు. కొబ్బరి నీళ్లను తాగితే తక్షణమే శక్తి వస్తుంది. సెలైన్ బాటిల్ వల్ల శరీరానికి ఏ స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కొబ్బరి బోండాం నీళ్లు కూడా అదే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

చాలామంది తరచూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అయితే కొబ్బరినీళ్లు కూల్ డ్రింక్స్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం చేకూరదు. తరచూ నోరు పొడిబారుతున్నా, అలసిపోయినా కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. నడుము చుట్టూ కొవ్వు సమస్యతో బాధ పడేవాళ్లకు ఆ కొవ్వును కరిగించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయి.

కొబ్బరి నీళ్లు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. పొట్ట చుట్టూ కొవ్వు సమస్యతో బాధ పడేవాళ్లు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు డైట్ లో కొబ్బరినీళ్లను భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు. కొబ్బరి నీళ్లు గుండె సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి.

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధ పడే వాళ్లకు కొబ్బరి నీళ్లు ఆ సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. తల తిరగడం, కడుపులో గడబిడ సమస్యల్ను సైతం కొబ్బరినీళ్లు దూరం చేస్తాయి. వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగితే నీరసం సమస్య తగ్గుముఖం పడుతుంది.