Tag Archives: comedian bramhanandam

భారీగా తగ్గిపోయిన బ్రహ్మానందం రెమ్యూనరేషన్.. ఎందుకంటే!

కమెడియన్ బ్రహ్మానందం అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఒకప్పుడు బ్రహ్మానందంలేని సినిమా అంటూ ఉండేది కాదు. కొన్ని సినిమాలు ఈయన కామెడీ ద్వారా విజయవంతమయ్యాయి అంటే అతిశయోక్తి లేదు. అంతగా తన కామెడీతో ప్రేక్షకులను సందడి చేసిన బ్రహ్మానందం వందల సినిమాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందారు. బ్రహ్మానందం లేని సినిమాలు ఉన్నాయంటే ఆ సినిమా ప్రేక్షకులకు ఒక వెలితిగానే ఉండేది. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మానందం ఒకప్పుడు గంటకు లక్ష రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునే వారు.

ఈ విధంగా బ్రహ్మానందం ఒక రోజుకు దాదాపు పది గంటలపాటు పని చేసి రోజుకు 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ఆ తర్వాత క్రమంగా సినిమా అవకాశాలు తగ్గడమే కాకుండా అతని రెమ్యునరేషన్ కూడా తగ్గిపోయిందని చెప్పవచ్చు.ఈ విధంగా సినిమా అవకాశాలు తగ్గడంతో బ్రహ్మానందం రోజుకు ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయిన బ్రహ్మానందం తాజాగా జాతిరత్నాలు సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమాలో నటించడం కోసం బ్రహ్మానందం ఎంత తీసుకున్నారు అనే విషయానికి వస్తే ఈ సినిమా కోసం బ్రహ్మానందం 5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఐదు రోజుల షూటింగ్ కలిపి.

ఒకప్పుడు రోజుకు ఐదు లక్షలు తీసుకునే బ్రహ్మానందం ప్రస్తుతం రోజుకు ఒక లక్ష మాత్రమే తీసుకోవడం గమనార్హం.అయితే ప్రస్తుతం బ్రహ్మానందంకు వయసు పైబడటమే కాకుండా ఎంతో మంది యంగ్ కమెడియన్స్ రావడం చేత ఇతనికి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా బ్రహ్మానందం పూర్తిగా కూర్చుని చేసే పాత్రలే ఆశిస్తూ ఉండడంతో అతనికి అవకాశాలు కూడా తగ్గాయని చెప్పవచ్చు.