Tag Archives: remunaration

Rashmika: రష్మిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…. ఇప్పుడు భారీగానే అందుకుంటుందిగా?

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.

ఈమె ఇటీవల తన 28వ పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు. రష్మికకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. రష్మిక కర్ణాటకలోనే జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.

ఇలా కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు..ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెను చూసి కిరిక్ పార్టీ సినిమా అవకాశాలు కల్పించారు. ఈ సినిమా కోసం ఈమె ఏ విధమైనటువంటి ఆడిషన్స్ కూడా నిర్వహించలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

మోడలింగ్ రంగంలో..
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఈమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో చలో సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 50 లక్షలు తీసుకున్నటువంటి రష్మిక అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

Star Producer: 10 లక్షలు సినిమా తీసి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాత… బయటపడ్డ అసలు బాగోతం!

Star Producer: సాధారణంగా సినిమా చేసే నిర్మాతలు అందరూ కూడా తమ చేసిన సినిమాకు కాస్త లాభాలు రావాలని భావిస్తారు. ఇలా లాభాల కోసం దర్శక నిర్మాతలు కూడా భారీగానే కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ సినిమాల విషయంలో కాస్త చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ లాభాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇక ఒకప్పుడు పెద్ద సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉండేది చిన్న సినిమాలను కనుక థియేటర్లో విడుదల చేయాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వచ్చేది.

ఇలా చిన్న సినిమాల విషయంలో ఎంతో కంగారుగా ఉండే నిర్మాతలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరైన ప్లాట్ ఫామ్ గా మారిపోయాయి. ఇలా చిన్న సినిమాలను విడుదల చేయడానికి ఎలాంటి సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు మాత్రం పలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. సినిమా క్వాలిటీ బాగుంటేనే డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ నిర్మాత కేవలం 10 లక్షల రూపాయలతో చీప్ క్వాలిటీ కెమెరాలతో సినిమా చేసి నటీనటులకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, తన సినిమాకు ఏకంగా 1.5 కోట్ల ఖర్చు అయిందని రెండు కోట్లకు తన సినిమాని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకీ పది లక్షలతో సినిమా చేసే రెండు కోట్ల డిమాండ్ చేస్తున్న నిర్మాత ఎవరు అనే విషయానికి వస్తే…

Star Producer: రెమ్యూనరేషన్లు ఎగ్గొట్టిన నిర్మాత…

నిర్మాత పేరు ఎమ్.వై. మహర్షి. ఇతను తీసిన సినిమా ‘1948 – అఖండ భారత్’. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్క రోజుకే ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించబడింది అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రెండు కోట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఈ సినిమా భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ డిమాండ్ చేయడంతో ఎవరు కూడా ముందుకురాలేదు అదే సమయంలో ఈయన ఈ చిత్ర బృందానికి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలియడంతో ప్రతి ఒక్కరు ఈయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.

Tamannaah: వామ్మో.. ఇన్నేళ్ల సినీ కెరియర్లో తమన్నా భారీగానే ఆస్తులు సంపాదించిందిగా… ఈమె ఆస్తి విలువెంతో తెలుసా?

Tamannaah: తమన్నా పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్నా గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.నూతన సంవత్సర వేడుకలలో భాగంగా గోవాలో తమన్నా నటుడు విజయ్ వర్మకు లిప్ లాక్ ఇవ్వడంతో ఈ వార్తలకు బలం చేకూరాయి. మరి నిజంగానే తమన్నా విజయ్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారా లేదా అనే విషయం తెలియాల్సి.

తెలుగు చిత్ర పరిశ్రమకు తమన్నా శ్రీ అనే సినిమా ద్వారా పరిచయమైనప్పటికీ ఈమెకు మాత్రం హ్యాపీ డేస్ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో తర్వాత వరుస అవకాశాలను అందుకొని తమన్నా వెను తిరిగి చూసుకోలేదు.ఇప్పటికీ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ భారీగా ఆస్తులు కూడ పెట్టినట్లు తెలుస్తుంది.

Tamannaah: కోట్లలో తమన్నా వార్షిక ఆదాయం…

తమన్న కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అలాగే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈమె ఏడాదికి సుమారు 12 కోట్ల రూపాయల వరకుసంపాదిస్తున్నారట ఇక ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ తమన్న ఏకంగా 110 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.

సినిమా మధ్యలో శ్రీహరి చనిపోతే.. ఆ క్యారెక్టర్ జగపతిబాబుని చేయమంటే ఏమన్నారో తెలుసా?

ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకుడిగా, నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటవర్వ్యూలో అతడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అతడు తీసిన సినిమాల్లో ఎక్కువ పాపులరిటీ తెచ్చుకున్న సినిమా ‘సౌఖ్యం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’. ఇదిలా ఉండగా.. ఇతడి దర్శకత్వంలోనే మొదట్లో వచ్చిన సినిమా అంబికా సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అంబికా కృష్ణ, అంబికా రామంజనేయులు నిర్మించిన యాక్షన్ చిత్రం ‘వీరభద్ర’.

ఇందులో నందమూరి బాలకృష్ణ, తనూశ్రీ దత్తా, సదా ప్రధాన పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2005 ఏప్రిల్ 29 న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వీరభద్ర తర్వాత అవకాశాలు లేక డిప్రెషన్ లో కి వెళ్లారట నిజమేనా అని అడగ్గా.. అలా ఎంలేదు.. 2005 లో రిలీజ్ అయిన వీరభద్ర తర్వాత ఆటాడిస్తా సినిమా తీశానన్నారు. 2005 నుంచి 2008 మధ్య మూడు సంవత్సరాల్లో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం.. పాప పుట్టడం జరిగింది.

ఈ గ్యాప్ లో కూడా తాను జగడం సినిమాలో ఆర్టిస్ట్ గా చేసినట్లు చెప్పారు. ఆ టైంలో కూడా కథలు రాశానని.. తర్వాత 2008లో ఆటాడిస్తా సినిమా తీశానని.. చెప్పుకొచ్చారు. ఇకపోతే గోపీచంద్ హీరోగా నటించిన ‘ఒంటరి’ సినిమాను తానే తీయాలని.. కాని తాను డబ్బులను ఎక్కువగా అడిగానని.. అందుకే తాను చేయలేకపోయానని.. అది నేను చేసిన తప్పు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పిల్లా నువ్వు లేని జీవితం సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చాడు. అందులో జగపతిబాబు పాత్రకు ముందుగా శ్రీహరిని అనుకున్నామని.. సెట్ పైకి షూటింగ్ కూడా మొదలు పెట్టామన్నారు. కానీ మధ్యలో శ్రీహరిగారు అకాల మరణం చెందారని చెప్పారు.

తర్వాత దీనికి జగపతిబాబు అడిగితె.. అయన చాలా సహృదయంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇక అక్కడ నుంచి జగపతి బాబుతో ఆ పాత్రను తీశామని చెప్పారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అల్లుఅరవింద్ సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తిగా ఉండటంతో మళ్లీ మరోసారి కథ రాసుకొని తీయమన్నారు. ఇలా మళ్లీ తీయడం.. వాళ్లకు నచ్చడం.. చివరకు 2014 నవంబర్ 14 న విడుదల అయింది. ఇలా ఈ సినిమాకు ఎక్కువగా సమయం పట్టడానికి గల కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చిత్ర కథానాయకుడైన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలోని ‘రేయ్’. కానీ ఇది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో.. సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటగా విడుదలైన చిత్రంగా “పిల్లా నువ్వు లేని జీవితం” గా ఇప్పటి వరకు చెప్పబడుతుంది.

దగ్గుపాటి రానా 25 రోజులకు అన్ని రూ. కోట్ల రెమ్యూనరేషనా..? షాక్ అవుతున్న నెటిజన్లు..

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం భీమ్లా నాయక్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీనిలో రానా దగ్గుపాటి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దీని నుంచి వచ్చిన టీజర్, సాంగ్ మరియు రానా చెప్పే డైలాగ్ ఓ రేంజిలో పాపులర్ అయ్యాయి.

సినిమా ప్రమోషన్ కి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే రానా దగ్గుపాటి ఏ సినిమాలో అయినా.. ఏ పాత్ర ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమను షేక్ చేసిన బాహుబలి సినిమాలో భ‌ళ్లాల‌ దేవుడి పాత్రతో ఆయన నటన ప్రతీ ఒక్కరిని మెప్పించింది. దాంతోనే అతడి స్థాయి బాగా పెరిగిందనడంలో సందేహం లేదు.

అయితే భీమ్లా నాయక్ సినిమాకు రానా రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు అతడు 25 రోజులకు కాల్ షీట్స్ ఇచ్చారట. దానికి అతడు రూ.4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలితో రేంజ్‌ పెరిగిన తరుణంలో ఆ మాత్రం తీసుకునే స్థాయి రానాకు ఉందని ఫిల్మీ వర్గాల టాక్.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం రిమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాగర్ కె చంద్ర. దీనికి తమన్ సంగీతం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నిత్యా మీనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై అసలు లెక్కలు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీ విడుదల కావడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే శనివారం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సాయిధరమ్ తేజ్ హాజరుకాలేక పోయినందువల్ల ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హీరో హీరోయిన్ ల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో ఎంత సంపాదిస్తే తనకి ఎంత మిగులుతుందన్న విషయాల గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక హీరో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో 10 శాతం ట్యాక్స్ పోగా అది కూడా కట్ చేసి హీరోకి ఇస్తారని దానిలో ఇతర ట్యాక్స్ లు మెయింటినెన్స్ కి పోనూ ఒక హీరోకు మిగిలేది ఏమీ ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు.

సాధారణంగా సినిమాలు తీసే హీరోలందరూ ఈజీగా డబ్బు సంపాదిస్తారనుకుంటారు. కానీ ఆ సినిమాలో ఆ హీరో ఎంత కష్ట పడతారో ఒక వారికి మాత్రమే తెలుసని, ప్రభాస్ రానా వంటివారు కండలు పెంచకపోతే బాహుబలి వచ్చేది కాదని, ఎన్టీఆర్ స్టెప్పులు చేయకపోతే, చరణ్ గుర్రపుస్వారీ చేయకపోతే డబ్బులు రావని ఈ సందర్భంగా హీరోల వెనక ఉన్న కష్టం తెలిపారు.

ఇక హీరోయిన్ల గురించి మాట్లాడుతూ హీరోయిన్స్ ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వస్తారని వారు అందరి మధ్యలో ఎంతో ఇబ్బంది పడుతూ నటిస్తారని వారి పడే కష్టం గురించి తెలియజేశారు. మేము కష్టపడితేనే డబ్బులు వస్తాయని సినిమావాళ్ళుకోట్లలో పారితోషకం తీసుకుంటున్నారని అర్హతలేని ప్రతి ఒక్కడు మాట్లాడుతారు. సినిమా వల్ల సంపాదించే ప్రతి రూపాయి వారి కష్టంతో సంపాదించినదే అక్రమ కట్టడాలు కాంటాక్ట్స్, టాక్స్ లు కట్టకుండా కోట్లు సంపాదించలేదని పరోక్షంగా పలువురు రాజకీయ నాయకులను ఉద్దేశించి ఈ సందర్భంగా మాటల తూటాలు వదిలారు.

బిగ్ బాస్ రెమ్యునరేషన్ క్యాన్సర్ పేషెంట్ కి ఇచ్చేసిన ఉమాదేవి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

బిగ్ బాస్ సీజన్ 5 లో ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి వారంలో సరయు బయటకు వస్తే.. రెండో వారంలో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి బయటకు వచ్చింది. అందులో ఉమాదేవి రెండు వారాలకు రూ. 1.60 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె తన నోటి దురుసు కారణంగానే బయటకు వచ్చారని.. ఆమె మాట్లాడే మాటలు బయట ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చలేదని అందుకు.. ఓట్లు ఎక్కువగా రాలేదని తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. ఆమెపై నెటిజన్లు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఎందుకో తెలుసా.. బిగ్‌బాస్‌ షోలో గయ్యాళి గంపగా పేరు తెచ్చుకున్న ఉమాదేవి తాజాగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. తన రెమ్యునరేషన్‌ను ఓ మంచి పని కోసం వినియోగించింది. ఆమెకు పారితోషికంతో కింద ఇచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఆమె బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు అందించింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమె దయా గుణానికి ప్రశంసిస్తున్నారు. ఆమెది గొప్ప మనసు అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఆమె గొంతు పెద్దదంటూ విమర్శించిన వారే.. ఆమె మనసు కూడా పెద్దది అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. చిన్నారికి ప్రాణం పోసిన ఉమాదేవికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారు. మొదట్లో ఆమె బయటకు వచ్చినప్పుడు.. గయ్యాళి బయటకు వెళ్లింది అంటూ విమర్శించిన వారు.. ఇప్పుడు ఆమె లేని లోటు కనిపిస్తుందంటూ చెబుతున్నారు.

హౌస్ లో మొత్తం నసే ఉందని.. వీలైతే ఉమాదేవిని రీఎంట్రీ ఇస్తే బాగుండని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. ఏం చేయాలన్నా బిగ్ బాస్ చేతిలోనే ఉంది. ఇలా పారితోషికం తీసుకొని మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం అనేది కష్టమే.

ఉప్పెన బ్యూటీ రెమ్యూనరేషన్ ఎంత పెరిగిందో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మొదటి సినమాతోనే ‘ఉప్పెన’ లా దూసుకువచ్చి.. కుర్రాకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది.. కృతిశెట్టి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మొదట ఆమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది. తర్వాత హీరోయిన్ అయిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది.

యాడ్స్ లో ఎంతోకొంత సంపాదించే ఈమె ఒక్కసారిగా లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉండగా.. ఎవరికైనా తన అభినమాన హీరోయిన్, హీరోలకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారనే ఆలోచన.. తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యూనరేషన్ గురించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తరువాత కృతి డేట్లు దొరకడం కష్టమేనని చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్లో అన్నారు.

అక్షరాలా ఇప్పుడు ఆయన అన్నట్టుగానే జరుగుతోంది. ఉప్పెన సినిమాకి రూ. 25 లక్షల లోపు పారితోషికం తీసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత నాని .. సుధీర్ బాబు సినిమాలకి కూడా కాస్త అటు ఇటు గానే పారితోషికం తీసుకుందట. ఆ తరువాత చైతూతో చేస్తున్న బంగార్రాజు .. నితిన్ జోడీగా చేస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా కోసం ఆమె తన పారితోషికాన్నిరూ. 50 లక్షలకు తీసుకెళ్లిందట.

ఉప్పెన సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనికి మాత్రం ఆమెకు కోటి రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇలా లక్షలతో మొదలైన ఆమె పారితోషికం.. కోటి వరకు వెళ్లింది.

యాంకర్ విష్ణుప్రియ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలోని నెటిజన్లు, బుల్లితెర ప్రేక్షకులను యాంకర్ విష్ణుప్రియ ఎలా కట్టిపడేస్తుంటుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించారు. విచ్చలవిడి అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇటీవల ఆమె ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన మాట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

యాంకర్‌ విష్ణు ప్రియ నెమ్మదిగా సినిమాలపై ఫోకస్‌ పెడుతుంది. టీవీ షోస్‌తో యాంకర్‌గా రచ్చ చేసిన ఈ హాట్‌ అందాల భామ ఇప్పుడు డిజిటల్‌ మీడియాలో హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. గ్లామర్‌ షో విషయంలో విష్ణు ప్రియ ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు తన అందాలను ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

తెలుగు, త‌మిళం, కన్న‌డ వంటి భాష‌ల‌లో న‌టించిన విష్ణు ప్రియ తెలుగులో పోవే పోరా అనే షోతో యాంక‌ర్‌గా అడుగుపెట్టింది. విష్ణు ప్రియ‌ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. తాజాగా ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ చిత్రంలో కూడా నటించింది.

1987 ఫిబ్రవరి 22 న హైదరాబాద్ లో జన్మించింది ఈ అమ్మడు. ఆమె ఒక్క షోకి రూ.50 నుంచి రూ.70 వేల వరకు తీసుకుంటుందంటూ టాక్. అయితే ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. వాళ్ల తండ్రి వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆమెకు మణికొండ దగ్గర కోటిన్నర విలువ చేసే ఫ్లాట్ తో మొత్తం ఆమె ఆస్తులు రూ. 5కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల టాక్. అంతే కాకుండా ఆమెకు విలువైన కార్లు కూడా ఉన్నాయి.

బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

యూట్యూబ్ వెబ్ సిరీస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ద్వారా పలు వెబ్ సిరీస్ లో కామెడీ వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు షణ్ముఖ్ జస్వంత్ . ఇలా పలు వీడియోలను చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న షణ్ముఖ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ఇతని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఏకంగా 3 మిలియన్స్ కు పెరిగిపోయారు. ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే కేవలం గంటల వ్యవధిలోనే అతని వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న షణ్ముఖ్ ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా వెలిగిపోతున్నారు.

ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమయంలో ఈయనకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. బయట ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ హౌస్ లో కూడా ఈయన రచ్చ మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి యూట్యూబ్ స్టార్ట్ పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నారనే సమాచారం వినబడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ షణ్ముఖ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉండటం చేత ఈయన డిమాండ్ చేసిన దానికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కి ఇవ్వకపోవడం గమనార్హం. హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తారు వేచి ఉండాలి.