Featured

సినిమా మధ్యలో శ్రీహరి చనిపోతే.. ఆ క్యారెక్టర్ జగపతిబాబుని చేయమంటే ఏమన్నారో తెలుసా?

ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకుడిగా, నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటవర్వ్యూలో అతడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అతడు తీసిన సినిమాల్లో ఎక్కువ పాపులరిటీ తెచ్చుకున్న సినిమా ‘సౌఖ్యం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’. ఇదిలా ఉండగా.. ఇతడి దర్శకత్వంలోనే మొదట్లో వచ్చిన సినిమా అంబికా సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అంబికా కృష్ణ, అంబికా రామంజనేయులు నిర్మించిన యాక్షన్ చిత్రం ‘వీరభద్ర’.

ఇందులో నందమూరి బాలకృష్ణ, తనూశ్రీ దత్తా, సదా ప్రధాన పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2005 ఏప్రిల్ 29 న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వీరభద్ర తర్వాత అవకాశాలు లేక డిప్రెషన్ లో కి వెళ్లారట నిజమేనా అని అడగ్గా.. అలా ఎంలేదు.. 2005 లో రిలీజ్ అయిన వీరభద్ర తర్వాత ఆటాడిస్తా సినిమా తీశానన్నారు. 2005 నుంచి 2008 మధ్య మూడు సంవత్సరాల్లో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం.. పాప పుట్టడం జరిగింది.

ఈ గ్యాప్ లో కూడా తాను జగడం సినిమాలో ఆర్టిస్ట్ గా చేసినట్లు చెప్పారు. ఆ టైంలో కూడా కథలు రాశానని.. తర్వాత 2008లో ఆటాడిస్తా సినిమా తీశానని.. చెప్పుకొచ్చారు. ఇకపోతే గోపీచంద్ హీరోగా నటించిన ‘ఒంటరి’ సినిమాను తానే తీయాలని.. కాని తాను డబ్బులను ఎక్కువగా అడిగానని.. అందుకే తాను చేయలేకపోయానని.. అది నేను చేసిన తప్పు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పిల్లా నువ్వు లేని జీవితం సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చాడు. అందులో జగపతిబాబు పాత్రకు ముందుగా శ్రీహరిని అనుకున్నామని.. సెట్ పైకి షూటింగ్ కూడా మొదలు పెట్టామన్నారు. కానీ మధ్యలో శ్రీహరిగారు అకాల మరణం చెందారని చెప్పారు.

తర్వాత దీనికి జగపతిబాబు అడిగితె.. అయన చాలా సహృదయంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇక అక్కడ నుంచి జగపతి బాబుతో ఆ పాత్రను తీశామని చెప్పారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అల్లుఅరవింద్ సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తిగా ఉండటంతో మళ్లీ మరోసారి కథ రాసుకొని తీయమన్నారు. ఇలా మళ్లీ తీయడం.. వాళ్లకు నచ్చడం.. చివరకు 2014 నవంబర్ 14 న విడుదల అయింది. ఇలా ఈ సినిమాకు ఎక్కువగా సమయం పట్టడానికి గల కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చిత్ర కథానాయకుడైన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలోని ‘రేయ్’. కానీ ఇది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో.. సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటగా విడుదలైన చిత్రంగా “పిల్లా నువ్వు లేని జీవితం” గా ఇప్పటి వరకు చెప్పబడుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago