ఈ టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు వచ్చాయి. చాలా మంది తమ ఆరోగ్యం పై అధిక మొత్తంలో శ్రద్ధ చూపడం లేదు. సమయానికి అన్నం తినకపోవడం.. వేళకు నిద్ర పోవడం లేదు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవాల్సి వస్తుంది.
దీంతో దొరికిందల్లా పక్కన పెట్టుకొని మరీ లాగేస్తున్నాడు. దీంతో ఉబకాయరాయుళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే చాలామంది తమ శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అయితే, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు.. శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలను, విటమిన్లను అందించే వాటిలో పుట్టగొడుగులు ప్రత్యేకంగా ఉంటాయి.
పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు అనేవి శిలీంద్రాలు. ఈ పుట్టగొడుగులను మనం సాధారణంగా కుళ్లిన పదర్ధాలు ఉన్న చోట చోడొచ్చు. అక్కడే ఎక్కువగా పెరుగుతాయి. అయితే కుళ్లిన పదర్థాలపై పెరుగుతున్న ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా.. అనే సందేహం కూడా చాలమందికి వచ్చే ఉంటుంది. కానీ ఇవి తినడం వల్ల ఎలాంటి రోగాలు రావని వైద్యనిపుణులు కూడా స్పష్టం చేశారు.
అనేక సంవత్సరాలు ఈ వైవిధ్యమైన ఆహారం పై ఎన్నో వైద్య పరిశోధనలు జరిగాయి. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం, ముఖ్యంగా మాంసకృతులు అధికంగా ఉండటం వలన పోషకాహారలోపంతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్‌కు చక్కగా పనిచేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…