నిజామాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి చేత బలవంతంగా మద్యం తాగించి.. ఆమె స్పృహ కోల్పోయాక బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు ఇలా తెలిపారు.
దేశంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నా.. ఉరి శిక్షలు పడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకానొక సందర్భాల్లో ఎన్ కౌంటర్ చేస్తున్నా చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాయివరుసుల మరిచి మరీ తల్లి, సోదరి అన్న తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచార ఘటన మరవక ముందే నిజామాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుది.
పట్టణంలో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ యువతి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెపై నలుగురు కామాంధులు కన్నేశారు. ఆ ఆసుపత్రిలోనే ఆమెను బలవంతంగా ఓ రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి అరుపులు, కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆమెకు బలవంతంగా మద్యం తాపించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…