పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ రంగంలో.. అటు రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారాయి. నటీనటులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. టికెట్లను ఆన్ లైన్ లో ఇవ్వడంపై తీవ్రంగా వ్యతికేకించడంతో పాటు.. ఏపీ మంత్రిని కూడా తీవ్రంగా దూషించాడు.
ఇదిలా ఉండగా.. ఆ వ్యాఖ్యల తర్వాత జనసేన కార్యకర్తల్లో కాస్త ఊపు వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అతడు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుండి ఆయన కారులో జనసైనికులతో కలిసి ర్యాలీ జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు.
అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆందోళనలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని జనసేన ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గుంటూరు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపరిస్థితి దారుణంగా ఉందని.. దీనిపై ఆందోళన కార్యక్రమాలను నిర్వమిస్తామని పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అతడి కార్యకర్తలే మాట్లాడారు. అంతేకాకుండా అక్టోబర్ 30 న బద్వేల్ లో జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అంశంపై కూడా పవన్ చర్చించునున్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ పర్యటలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరులోని మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్ రాగానే.. ప్రమాదవ శాత్తు కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిలో ఓ అభిమానికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…