ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి అనుకోవచ్చు. అతడి మాటలకు ఎవరు భయపడే వారు లేరని.. సంపూర్ణేష్ బాబు ఎలానో.. పవన్ కాళ్యాణ్ కూడా అంతే అంటూ ఏపీ మంత్రులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే పోసాని కూడా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తుండగా.. వాటికి ప్రతి కౌంటర్ గా పోసాని మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్‌పై ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు విషం పాకిన చెట్టు నీడలో ఉన్నాడని.. అక్కడ ఉన్నంత కాలం ఎదగలేరన్నారు.
తను సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. పది అడుగులు నడిచి ప్రజలు ఎక్కువగా కనిపిస్తే.. పక్కనే వచ్చే కారు ఎక్కే నువ్వు.. జగన్ లాగా పాదయాత్ర చేయగలవా అంటూ ప్రశ్నించారు. పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడి సిద్దాంతం ఏంటో అతడికైనా తెలుసా… అంటూ వ్యగ్యంగా మాట్లాడారు.
సినిమా టికెట్లను ఆన్ లైన్ లో పెట్టడం అనే నిర్ణయాన్ని చిరంజీవి, సీ కళ్యాణ్ ఇతరులు సీఎం జగన్ ను కలిసిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో నాయకుడిగా చెప్పుకునే నువ్వు.. దొంగ టికెట్లను సపోర్టు చేస్తే.. నాయకుడివి ఎలా అవుతావని ప్రశ్నించారు. మంచి వైపు మాట్లాడే వారు లీడర్లు అని.. జగన్ ఎం తప్పు చేశారని మాట్లాడుతున్నావ్ అంటూ అడిగారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…