Featured

నాగబాబు పవన్ వ్యతిరేకస్తులకు మీమ్స్, ఆడియో, వీడియోల రూపంలో సమాధానం..!

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. మంత్రి పేర్ని నాని గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రులు.. అదే విధంగా పవన్ వర్సస్ పోసాని అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని తెర మీదకు తొలి రోజు పవన్ పైన విమర్శలు చేసారు.

జగన్ పాలనను ప్రశంసించారు. ఇక రెండ సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇక వెంటనే నాగబాబు.. అతడికి వార్నింగ్ ఇచ్చాడు. ఆస్క్‌ మీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. మళ్లీ పాలిటిక్స్‌లో వస్తారా అంకుల్‌ అనే ప్రశ్నకు.. నాకు ఇంట్రెస్ట్‌ పోయింది అనే మీమ్‌తో ఆన్సర్‌ ఇచ్చారు. అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందించాలని కోరగా ఆయన ఒక పవన్ పైన పోసాని మాట్లాడిన ఒక వీడియో పోస్టు చేసారు.

ఆ వీడియోలో ఏముందంటే.. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పవన్ సినిమాలోకి వస్తానంటే.. తాను అతడికి బ్లాంక్ చెక్ ఇస్తానని.. అందులో ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు…అని అందులో పోసాని చెబుతారు. ఇక ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారంలో ఏపీ మూవీ టికెట్స్‌ గురించి మీ అభిప్రాయం అడగ్గా విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మోసాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్‌ చేశారు.

అందులో వారిద్దరు డబ్బులు పంచుకుంటుండగా.. ఎప్పుడైనా సరిగ్గా పంచావరా.. అటూ బ్రహ్మానందం వాపోయే సీన్‌ చూపించారు. మోసం చేసినవాడు బాగుపడడురా.. అని బ్రహ్మానందం శపించగా… ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి అని రవితేజ లైట్‌ తీసుకుంటాడు. ఇక, పోసాని గురించి ఒక్క మాట అనే దానికి మాధానంగా..సమరసింహారెడ్డి లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌… కుక్కపిల్ల మొరిగిందనుకో అనేది ఆ ఫొటో సారాంశంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు నాగబాబు మీమ్స్, ఆడియో, వీడియోలతో సమాధానం చెబుతారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago