ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకుడిగా, నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ ఇంటవర్వ్యూలో అతడు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అతడు తీసిన సినిమాల్లో ఎక్కువ పాపులరిటీ తెచ్చుకున్న సినిమా ‘సౌఖ్యం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’. ఇదిలా ఉండగా.. ఇతడి దర్శకత్వంలోనే మొదట్లో వచ్చిన సినిమా అంబికా సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అంబికా కృష్ణ, అంబికా రామంజనేయులు నిర్మించిన యాక్షన్ చిత్రం ‘వీరభద్ర’.

ఇందులో నందమూరి బాలకృష్ణ, తనూశ్రీ దత్తా, సదా ప్రధాన పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2005 ఏప్రిల్ 29 న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వీరభద్ర తర్వాత అవకాశాలు లేక డిప్రెషన్ లో కి వెళ్లారట నిజమేనా అని అడగ్గా.. అలా ఎంలేదు.. 2005 లో రిలీజ్ అయిన వీరభద్ర తర్వాత ఆటాడిస్తా సినిమా తీశానన్నారు. 2005 నుంచి 2008 మధ్య మూడు సంవత్సరాల్లో మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అవ్వడం.. పాప పుట్టడం జరిగింది.

ఈ గ్యాప్ లో కూడా తాను జగడం సినిమాలో ఆర్టిస్ట్ గా చేసినట్లు చెప్పారు. ఆ టైంలో కూడా కథలు రాశానని.. తర్వాత 2008లో ఆటాడిస్తా సినిమా తీశానని.. చెప్పుకొచ్చారు. ఇకపోతే గోపీచంద్ హీరోగా నటించిన ‘ఒంటరి’ సినిమాను తానే తీయాలని.. కాని తాను డబ్బులను ఎక్కువగా అడిగానని.. అందుకే తాను చేయలేకపోయానని.. అది నేను చేసిన తప్పు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పిల్లా నువ్వు లేని జీవితం సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చాడు. అందులో జగపతిబాబు పాత్రకు ముందుగా శ్రీహరిని అనుకున్నామని.. సెట్ పైకి షూటింగ్ కూడా మొదలు పెట్టామన్నారు. కానీ మధ్యలో శ్రీహరిగారు అకాల మరణం చెందారని చెప్పారు.
తర్వాత దీనికి జగపతిబాబు అడిగితె.. అయన చాలా సహృదయంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇక అక్కడ నుంచి జగపతి బాబుతో ఆ పాత్రను తీశామని చెప్పారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా అల్లుఅరవింద్ సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తిగా ఉండటంతో మళ్లీ మరోసారి కథ రాసుకొని తీయమన్నారు. ఇలా మళ్లీ తీయడం.. వాళ్లకు నచ్చడం.. చివరకు 2014 నవంబర్ 14 న విడుదల అయింది. ఇలా ఈ సినిమాకు ఎక్కువగా సమయం పట్టడానికి గల కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చిత్ర కథానాయకుడైన సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక, నిర్మాణ సారథ్యంలోని ‘రేయ్’. కానీ ఇది రిలీజ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో.. సాయి ధరమ్ తేజ్ యొక్క మొదటగా విడుదలైన చిత్రంగా “పిల్లా నువ్వు లేని జీవితం” గా ఇప్పటి వరకు చెప్పబడుతుంది.































