Categories: FeaturedMovie News

జగన్ పై దాడి.. నోరు జారిన డిప్యూటీ సీఎం..

రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మరాయి. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించడం.. దానికి ప్రతి కౌంటర్ గా ఏపీ మంత్రలు సమాధానం ఇవ్వడం. పోసాని పవన్ పై వ్యక్తిగతంగా కూడా దూషించడం వంటివి చోటుచేసుకున్నాయి.

ఇందులో భాగంగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు జారారు. పవన్ పై దూషణ పర్వంలో భాగంగా జగన్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ పై ప్రజలే దాడి చేస్తారనడానికి బదులుగా ‘జగన్ పై ప్రజలే దాడి చేస్తారంటూ’ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇక సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ మామూలుగా రావడంలేదు.

మీమ్స్, సెటైర్స్ తో నారాయణ స్వామిని నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ఇలా నోరు జారిన వాళ్లు అంతకముందు చాలానే ఉన్నా..ఇది ప్రస్తుతం ఎక్కవుగా వైరల్ అవుతోంది. ఎందుకంటే.. పవన్ వ్యాఖ్యలపైనే ఎక్కువగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీంతో ఇలా అతడు పొరపాటున అన్నా.. దానిని సోషల్ మీడియాలో మాత్రం వదలడం లేదు.

ఇకపోతే.. పోసాని ప్రెస్ మీట్లలో పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా పోసానిపై పవన్ అభిమానులు దాడి చేసే వరకు వెళ్లారు. మొదట అతడిని ట్రోల్ చేసిన అభిమానులు.. వ్యక్తిగతంగా పోసాని మాట్లాడటంతో.. దాడికి యత్నించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని.. బూతులు తిడుతున్నారని అంటూ తాను సైతం బూతు పురాణాన్ని ఓపెన్ చేసి.. ఆవేదన వ్యక్తం చేశాడు పోసాని.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago