మొదటి సినమాతోనే ‘ఉప్పెన’ లా దూసుకువచ్చి.. కుర్రాకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది.. కృతిశెట్టి. మాతృభాష కన్నడం అయినా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మొదట ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది. తర్వాత హీరోయిన్ అయిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది.
యాడ్స్ లో ఎంతోకొంత సంపాదించే ఈమె ఒక్కసారిగా లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టింది. ఇదంతా ఇలా ఉండగా.. ఎవరికైనా తన అభినమాన హీరోయిన్, హీరోలకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారనే ఆలోచన.. తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ప్రస్తుతం కృతిశెట్టి రెమ్యూనరేషన్ గురించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తరువాత కృతి డేట్లు దొరకడం కష్టమేనని చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్లో అన్నారు.
అక్షరాలా ఇప్పుడు ఆయన అన్నట్టుగానే జరుగుతోంది. ఉప్పెన సినిమాకి రూ. 25 లక్షల లోపు పారితోషికం తీసుకున్న కృతి శెట్టి, ఆ తరువాత నాని .. సుధీర్ బాబు సినిమాలకి కూడా కాస్త అటు ఇటు గానే పారితోషికం తీసుకుందట. ఆ తరువాత చైతూతో చేస్తున్న బంగార్రాజు .. నితిన్ జోడీగా చేస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా కోసం ఆమె తన పారితోషికాన్నిరూ. 50 లక్షలకు తీసుకెళ్లిందట.
ఉప్పెన సినిమాను బాలీవుడ్ లో రిమేక్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దీనికి మాత్రం ఆమెకు కోటి రూపాయల పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఇలా లక్షలతో మొదలైన ఆమె పారితోషికం.. కోటి వరకు వెళ్లింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…