దహన సంస్కారాలకు డబ్బులు లేక ఓ వ్యక్తి తన భార్య శవాన్ని దుప్పట్లో చుట్టి.. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పడేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. అలా అతడి తన స్నేహితుడి సహకారం తీసుకొని తీసుకెళ్తుండా.. స్థానికులు పట్టుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హైదరాబాద్ శివారు ప్రాతంలో ఉన్న హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.
హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతడు మేస్త్రీ పని చేస్తుండగా.. ఆమె కూలీ పనులు చేస్తూ ఉంటుంది. ఆమె ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉండగా.. తన భర్త పనికి వెళ్లి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపటకి ఆమె మృతి చెందింది.
అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళ్తున్నాడు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించగా శనివారం ఉదయం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. అందులో ఆమె అనారోగ్యంతోనే మరణించిందంటూ వెల్లడించారు. దీంతో పోలీసులు వారి కుటుంసభ్యులను పిలిపించి త్వరలోనే మృత దేహాన్ని అప్పగిస్తామంటూ పోలీసులు తెలిపారు. దీనిపై నిన్న విభన్న కథనాలు వినిపించాయి. కానీ పోలీసులు పోస్టు మార్టం రిపోర్టు రాగానే నిజాలను వెల్లడించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…