కాలేజీలో స్నేహితుల మధ్య గొడవలు అనేవి కామన్. గొడవ కొద్దిసేపు జరిగితే.. తర్వాత మాట్లాడుకొని.. సంతోషంగా ఉంటారు. కానీ అదే గొడవ ఇంకా ఎక్కువ అయితే మాత్రం అనర్థాలకు దారి తీస్తుంది. ఇలా ఓ నలుగురు విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకుంటూ.. చిన్న వాగ్వాదం కాస్త ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది.
అక్కడే ఉన్న ఇంకా కొంతమంది విద్యార్థులు అందులో ఒక విద్యార్థిని కాలేజీ బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. దీంతో ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం వరంగల్ లోని నర్సంపేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ నర్సంపేటలో బిట్స్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. అందులో చదువుకుంటున్న నలుగురు విద్యార్థుల మధ్య ఏదో చిన్న విషయమై గొడవ జరిగింది.
దీనిలో ఆ నలుగురు విద్యార్థుల మధ్య గొడవ కాస్త పెద్దగా మారిపోయింది. అక్కడే ఉన్న మిగతా విద్యార్ధులు కూడా ఆ విద్యార్థుల్లో ఒకరిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. సంజయ్ అనే వ్యక్తిని ఆ కాలేజి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి తోసేశారు. వెంటనే కాలేజీ యాజమాన్యం అతడిని అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించారు.
ఆ గొడవలో పాల్గొన్న మిగిలిన విద్యార్థులు పారిపోకుండా అక్కడే ఉంచారు కాలేజీ యాజమాన్యం. సంజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో స్థానికంగా అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న సంజయ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…