Movie News

Star Producer: 10 లక్షలు సినిమా తీసి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాత… బయటపడ్డ అసలు బాగోతం!

Star Producer: సాధారణంగా సినిమా చేసే నిర్మాతలు అందరూ కూడా తమ చేసిన సినిమాకు కాస్త లాభాలు రావాలని భావిస్తారు. ఇలా లాభాల కోసం దర్శక నిర్మాతలు కూడా భారీగానే కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం తమ సినిమాల విషయంలో కాస్త చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తూ లాభాలను అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇక ఒకప్పుడు పెద్ద సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉండేది చిన్న సినిమాలను కనుక థియేటర్లో విడుదల చేయాలంటే నిర్మాతలకు తల ప్రాణం తోకకు వచ్చేది.

ఇలా చిన్న సినిమాల విషయంలో ఎంతో కంగారుగా ఉండే నిర్మాతలకు లాక్డౌన్ సమయంలో ఓటీటీలు సరైన ప్లాట్ ఫామ్ గా మారిపోయాయి. ఇలా చిన్న సినిమాలను విడుదల చేయడానికి ఎలాంటి సమస్య లేకుండా పోయింది అయితే ఇప్పుడు మాత్రం పలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమా హక్కులను కొనుగోలు చేయాలన్నా కూడా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. సినిమా క్వాలిటీ బాగుంటేనే డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఓ నిర్మాత కేవలం 10 లక్షల రూపాయలతో చీప్ క్వాలిటీ కెమెరాలతో సినిమా చేసి నటీనటులకు రెమ్యూనరేషన్ ఇవ్వకుండా, తన సినిమాకు ఏకంగా 1.5 కోట్ల ఖర్చు అయిందని రెండు కోట్లకు తన సినిమాని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఇంతకీ పది లక్షలతో సినిమా చేసే రెండు కోట్ల డిమాండ్ చేస్తున్న నిర్మాత ఎవరు అనే విషయానికి వస్తే…

Star Producer: రెమ్యూనరేషన్లు ఎగ్గొట్టిన నిర్మాత…

నిర్మాత పేరు ఎమ్.వై. మహర్షి. ఇతను తీసిన సినిమా ‘1948 – అఖండ భారత్’. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాని థియేటర్లలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్క రోజుకే ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించబడింది అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా రెండు కోట్లకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఈ సినిమా భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ డిమాండ్ చేయడంతో ఎవరు కూడా ముందుకురాలేదు అదే సమయంలో ఈయన ఈ చిత్ర బృందానికి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలియడంతో ప్రతి ఒక్కరు ఈయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago