Movie News

బిగ్ బాస్ 5 లో షణ్ముఖ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

యూట్యూబ్ వెబ్ సిరీస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ద్వారా పలు వెబ్ సిరీస్ లో కామెడీ వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు షణ్ముఖ్ జస్వంత్ . ఇలా పలు వీడియోలను చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న షణ్ముఖ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ఇతని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు ఏకంగా 3 మిలియన్స్ కు పెరిగిపోయారు. ఒక్క వీడియో యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తే కేవలం గంటల వ్యవధిలోనే అతని వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న షణ్ముఖ్ ప్రస్తుతం యూట్యూబ్ స్టార్ గా వెలిగిపోతున్నారు.

ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇలా మంచి క్రేజ్ సంపాదించుకున్న సమయంలో ఈయనకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. బయట ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ్ హౌస్ లో కూడా ఈయన రచ్చ మామూలుగా ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడానికి యూట్యూబ్ స్టార్ట్ పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నారనే సమాచారం వినబడుతుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ షణ్ముఖ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉండటం చేత ఈయన డిమాండ్ చేసిన దానికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇప్పటివరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్ కి ఇవ్వకపోవడం గమనార్హం. హౌస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తారు వేచి ఉండాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago