బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి ధనుష్ గురించి మనకు తెలిసిందే. కీర్తి, ధనుష్ ఎన్నో సీరియల్స్ లో నటించే విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. సీరియల్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి నిజజీవితంలో ఒక్కటయ్యారు. సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్న కీర్తి హిట్లర్ సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అందుకు కారణం ఈమె తల్లి కావటమే.
కీర్తి గత కొద్ది రోజుల క్రితం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం కీర్తి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఇదే విషయమై సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న కీర్తి సురేష్ తాజాగా తన కొడుకు నామకరణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ క్రమంలోనే నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన కొడుకు పేరును వెల్లడించారు.
కీర్తి, ధనుష్ వారి కొడుకు రుద్వేద్ అని నామకరణం చేశారు. వీరి బాబు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నప్పటికీ, బాబు ఫేస్ ను మాత్రం చూపించలేదు. అయితే రీసెంట్ గా జరుపుకున్న నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలను కీర్తి ధనుష్ షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మీ కొడుకు ఫోటో ఇప్పటికైనా చూపించండి, మీ కొడుకు ఫోటో చూడకుండా వుండలేకపోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నటి కీర్తి బుల్లితెర నటి మంజుల చెల్లెలు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నామకరణ మహోత్సవంలో భాగంగా మంజుల, పరిటాల నిరుపమ్ దంపతులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ నామకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…