Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినటువంటి రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు.
ఈమె ఇటీవల తన 28వ పుట్టినరోజు వేడుకలను ఎంత ఘనంగా జరుపుకున్నారు. రష్మికకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త సంచలనంగా మారింది. రష్మిక కర్ణాటకలోనే జన్మించి అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ఇలా కాలేజీ చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు..ఇలా మోడలింగ్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఈమెను చూసి కిరిక్ పార్టీ సినిమా అవకాశాలు కల్పించారు. ఈ సినిమా కోసం ఈమె ఏ విధమైనటువంటి ఆడిషన్స్ కూడా నిర్వహించలేదు. ఇక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
మోడలింగ్ రంగంలో..
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం ఈమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో చలో సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమాకు 50 లక్షలు తీసుకున్నటువంటి రష్మిక అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…