Movie News

Tollywood: ఏపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?

Tollywood: ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్నికలలో నిలబడిన సంగతి మనకు తెలిసిందే. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నగరి నియోజక వర్గం నుంచి సినీ నటి రోజా ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే గత ఎన్నికలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీకి అలాగే టిడిపి పార్టీకి పలు సినీ సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో కూడా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ టాలీవుడ్ స్టార్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎవరికి మద్దతు తెలపలేదు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.

సినీ కెరియర్ కు ఇబ్బందులు..
ఇలా ఎన్నికలకు టాలీవుడ్ స్టార్స్ దూరంగా ఉండడానికి కారణం లేకపోలేదు ఒకవేళ తాము సపోర్ట్ చేసే పార్టీ కాకుండా అధికారంలోకి మరో పార్టీ వస్తే తమ సినీ కెరీర్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఇలా సెలబ్రిటీలందరూ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది స్టార్స్ ఆ పార్టీకి మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి కానీ ప్రస్తుతం మాత్రం సెలబ్రిటీలందరూ కూడా మౌనంగా ఉన్నారనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

24 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

24 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

24 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

24 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

1 day ago