Sai Pallavi: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సాయి పల్లవి ఒకరు. ఇప్పటివరకు సౌత్ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ గ్లామర్ పక్కన పెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు.
ఇలా ఈమె నటన ప్రతిభ చూసినటువంటి బాలీవుడ్ దర్శకులు సైతం ఈమెకు బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ కుమారుడితో ఓ సినిమా షూటింగులో బిజీగా ఉన్నటువంటి ఈమెకు హిందీలో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో కూడా భాగం కాబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించగా సాయిపల్లవి సీతమ్మగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచారని సమాచారం.
రెండింతల పెంచిన రెమ్యూనరేషన్..
ఈమె సౌత్ లో ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే రామాయణం సినిమాలో నటించడానికి తన రెమ్యూనరేషన్ డబుల్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలోనే ఈమె తన రెమ్యూనరేషన్ కూడా పెంచారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…