Kalki: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఈయన హీరోగా వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కినటువంటి ఈ చిత్రం మే తొమ్మిదవ తేదీ అత్యధిక భాషలలో విడుదలకు సిద్ధమైంది. తొమ్మిదవ తేదీ ఈ సినిమా రాబోతుందనే విషయం తెలిసే ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అయితే మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది అనే సంగతి తెలిసిందే.
మే 13వ తేదీ ఏపీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా రాజకీయాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లాంటి హీరోలు నటించిన సినిమాలు వచ్చిన కూడా ప్రేక్షకులు పట్టించుకునే పరిస్థితులలో ఉండరు. అందుకే ఈ సినిమాని వాయిదా వేయాలని నిర్మాతలు భావించారు.
ఉగాది నుంచి ప్రమోషన్స్..
ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో మే 9వ తేదీ విడుదల కావలసినటువంటి ఈ సినిమాని మే 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. ఇక ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…