Tag Archives: Comedian Yogi Babu

MS Dhoni: అద్భుతమైన గిఫ్ట్ తో కమెడియన్ యోగి బాబును సర్ప్రైజ్ చేసిన ఎమ్ యస్ ధోని.. ఫోటో వైరల్!

MS Dhoni: సినిమా ఇండస్ట్రీకి క్రికెట్ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ నిర్మాతగా మారి సొంత బ్యానర్ లో ఓ తమిళ సినిమాని చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ పనులను ప్రారంభించింది.

ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మించిన నిర్మాణ సంస్థలో
లెట్స్ గెట్ మ్యారీడ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కళ్యాణ్ అలాగే ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే కమెడియన్ ధోనీకి వీరాభిమాని.

క్రికెట్ అంటే కూడా ఈయనకు విపరీతమైన ప్రత్యేకతకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. షూటింగ్ లొకేషన్లో కూడా షూటింగ్లో ఏమాత్రం గ్యాప్ దొరికిన బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. ఇలా క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి యోగి బాబుకు ధోని స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేశారు.

MS Dhoni: బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చిన ధోని…


ధోని స్వయంగా సంతకం చేసినటువంటి ఒక బ్యాట్ యోగి బాబుకు కానుకగా పంపించారు. ధోని యోగి బాబు కోసం సంతకం చేసినటువంటి బ్యాట్ పంపించడంతో యోగి బాబు సంతోషంలో మునిగి తేలుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comedian Yogi Babu: పేరుకే కమెడియన్… చేసేవన్నీ కంత్రి పనులే.. ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబం!

Comedian Yogi Babu:కమెడియన్ యోగి బాబు అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం ఈయన అందరికీ పరిచయమైన విధంగానే అనిపిస్తారు. ఇలా కమెడియన్ యోగి బాబు పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

తాజాగా యోగి బాబు, నితిన్‌ సత్య కథానాయకులుగా, గాయత్రి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ముత్తు, భువనేశ్వరి, ఉమా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా దాదా.ఎనీ టైం మనీ ఫిలిమ్స్ పతకం పై గిన్నిస్ కిషోర్ కధ మాటలు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.

ఇక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాకుండా యోగి బాబు అడ్డుకున్నారని నిర్మాత కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సినిమాని కొనుగోలు చేయడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన పర్సనల్ గా ఫోన్ చేసి ఈ సినిమాలో కేవలం తాను నాలుగు సీన్లలో మాత్రమే నటించానని ఈ సినిమా కనుక కొనుక్కుంటే నష్టపోతారంటూ సినిమా గురించి చెడుగా ప్రచారం చేశారట.

Comedian Yogi Babu: సినిమా గురించి చెడుగా ప్రచారం చేసిన యోగిబాబు…


ఈ విధంగా ఈయన చెడుగా ప్రచారం చేయడంతో సినిమా కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి సినిమా కొనుక్కొని చూస్తేనే కదా ఆయన నాలుగు సీన్లలో నటించారా లేఖ 40 సీన్లలో నటించారా అనేది తెలుస్తుంది అంటూ ఆవేదన చెందారు.ఇక తన తదుపరి సినిమాకి కూడా యోగిబాబు అడ్వాన్స్ తీసుకున్నారని అలాగే ఆ సినిమాలో నటించిన మొండికేస్తున్నారంటూ కిషోర్ ఆవేదన చెందారు. ఇక ఈ సినిమా కనుక విడుదల కాకపోతే తన కుటుంబం మొత్తానికి ఆత్మహత్య తప్ప వేరే ఛాన్స్ లేదంటూ కిషోర్ ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురు యోగి బాబు చూడటానికి కమిడియన్ గా అనిపించిన ఇంత కంత్రి నా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.