Tag Archives: Corona on Children

గుడ్ న్యూస్.. ఇక వారికి దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉండవు..!

కరోనా సోకిన పిల్లల్లో కోవిడ్ వ్యాధి లక్షణాలు దీర్ఘకాలంగా ఉండవు. ఒక వారంలోనే కోలుకుంటారు. దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు కొద్దిమంది పిల్లలలో మాత్రమే కనిపిస్తాయని లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే నెల రోజుల పాటు బాధపడుతున్నారని తెలిపింది. అది కూడా 4 వారాలు మాత్రమే అని పరిశోధనలో వెల్లడైంది.

అదే 8 వారాల దాకా ఉన్నాడంటే మాత్రం.. ఆ పిల్లాడు పూర్తిగా కోలుకుంటాడు. పిల్లల్లో కోవిడ్ లక్షణాల్లో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు గొంతు నొప్పి, అలసట, తలనొప్పి మరియు వాసన రాకపోవడం. దీనికి సబంధించి అక్కడ కౌమార ఆరోగ్యం అనే జర్నల్‌లో ప్రచురించారు. కోవిడ్ బారిన పడిన పిల్లలు 4.4 శాతం వరకు మాత్రమే ఎక్కువ కాలం కోలుకోకుండా ఉంటుంన్నారని వెల్లడించింది.

4 వారాలలోపు కోలుకున్న వారికి కూడా ఎలాంటి ఇతర రోగాలు రావంటూ తెలిపారు. ఈ పరిశోధనను కోవిడ్ యాప్ అయిన జో యాప్ తో నిర్వహించారు. ఇది ఇంగ్లాండ్ లోని ప్రజలు ఉపయోగిస్తారు. ఈ యాప్‌లో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 2.5 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటా ఉంటుంది.
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.

సోకినా చాలా మంది పిల్లలు లక్షణాలను కూడా చూపించరు లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది పిల్లల్లో కోవిడ్ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదని చెబుతున్నారు. పిల్లలకు కోవిడ్ వల్ల విపరీతమైన ప్రమాదం మాత్రం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది.