Tag Archives: corona vaccine affect pregnancy

కోవిడ్‌ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

కరోనా నుంచి తమకు తాను రక్షించుకోవాలటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. అయితే టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా.. గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా.. గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా.. వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవి నిజం కాదని.. వాటి వల్ల ఎలాంటి హాని కలగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పారు. ఆ అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు.

టీకా తీసుకుంటే.. స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు దృష్టి సారించారు. సంతాన సౌభాగ్యంపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, గైనకాలజిస్టు డాక్టర్‌ మేరీ జేన్‌ మిన్‌కిన్‌ అన్నారు. కరోనా వ్యాక్సిన్ అనేది మామూలు వాళ్ల కంటే గర్భవతులు తీసుకోవడం చాలా మందచిదని.. ఎందుకంటే.. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆక్సిజన్ అవసరం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని
సీడీసీ నిపుణులు పేర్కొంటున్నారు.

అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ధైర్యంగా టీకాలు వేసుకోవచ్చిన ఇమోరి యూనివర్సిటీ గైనకాలజీ శాఖ చీఫ్‌, డాక్టర్‌ డెనిస్‌ జేమిసన్‌ స్పష్టం చేశారు. ఆలస్యం అసలు చేయవద్దని సూచించారు.