కరోనా నుంచి తమకు తాను రక్షించుకోవాలటే వ్యాక్సిన్ ఒకటే మార్గం. అయితే టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా.. గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా.. గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా.. వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవి నిజం కాదని.. వాటి వల్ల ఎలాంటి హాని కలగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల గర్భధారణపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పారు. ఆ అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు.
టీకా తీసుకుంటే.. స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు దృష్టి సారించారు. సంతాన సౌభాగ్యంపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, గైనకాలజిస్టు డాక్టర్ మేరీ జేన్ మిన్‌కిన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ అనేది మామూలు వాళ్ల కంటే గర్భవతులు తీసుకోవడం చాలా మందచిదని.. ఎందుకంటే.. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని.. ఆక్సిజన్ అవసరం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని
సీడీసీ నిపుణులు పేర్కొంటున్నారు.
అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు ధైర్యంగా టీకాలు వేసుకోవచ్చిన ఇమోరి యూనివర్సిటీ గైనకాలజీ శాఖ చీఫ్, డాక్టర్ డెనిస్ జేమిసన్ స్పష్టం చేశారు. ఆలస్యం అసలు చేయవద్దని సూచించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…