Tag Archives: curd benefits for hair

ఈ వ్యాధులు ఉన్నవాళ్లు పెరుగును తినకూడదు.. ఎందుకంటే..!

పెరుగును ప్రతీ ఒక్కరు ఇష్టపడుతుంటారు. అన్నం తిన్న తర్వాత చివరలో ఎవరైనా పెరుగు వేసుకొని అన్నం తింటారు. దీనికి కారణం ఏంటంటే.. కడుపులో అది చల్లదనాన్ని ఇస్తుంటుంది. అందుకే పెరుగు అన్నం తినకుండా కూడా చాలామంది ఉండలేరు. అంతటి స్థానాన్ని సంపాదించుకుంది పెరుగు.

అయితే ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మానవ శరీరంలో ఎముకలు గట్టిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ మరియు అధిక బీపీ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలేవారికి కూడా ఈ పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం చాలా ప్రమాదకరం.

అలాగే పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న వారు పెరుగు తీసుకోవడం మంచిది కారు. అర్థరైటిస్ రోగులు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి.

ఎందుకంటే అది నొప్పిని ఇంకా తీవ్ర తరం చేస్తుంది. అంతేకాకుండా శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు కూడా పెరుగును తీసుకోకుండా ఉండటమే మంచిది. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకపోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి పూట పెరుగు అస్సలు ముట్టుకోవద్దు.