Tag Archives: Devaragattu Bunny Fight

ఇదెక్కడి సాంప్రదాయ…కర్రలతో కొట్టుకున్నారు.. 100 మందికిపైగా గాయాల పాలయ్యారు..!

విజయదశమి సందర్భంగా అక్కడ సంప్రదాయంగా వస్తున్న పద్ధతి కర్రలతో సమరం. ఈ సారి అక్కడ హింస చెలరేగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయాలు అయ్యాయి. 9 మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. శుక్రవారం అర్థరాత్రి ఈ సమరం ప్రారంభమైంది.

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జైత్రయాత్రలో హింస చెలరేగింది. సుమారు వంద మందికి గాయాలయ్యాయి. స్వామి వార్ల కల్యాణానికి ముందు నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడే ఉన్న కొండపై నుంచి ఉత్సవానికి సంబంధించిన విగ్రహాలను భక్తులు పల్లకిలో జైత్రయాత్ర కోసం కిందకు తీసుకువచ్చారు.

ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాల భక్తులు.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు ఉండగా.. అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు ఉండి.. ఇరువురు విడిపోయి కర్రలతో తలపడ్డారు. రింగులు తొడిగిన కర్రలతో భక్తులు కొట్టుకున్నారు.

ఇటువంటి హింస జరగకూడదని పోలీసులు ముందుగానే పహారా కాశారు. కానీ వాళ్లు ఈ హింసను నిలువరించలేకపోయారు. ప్రతి ఏటాలానే వంద మందికిపైగా తలలు పగిలాయి. దీంతో ఆ ఘటనపై లోకాయుక్తతో పాటు మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది. కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. కళ్లెదుటే హింస జరగుతుంటే పోలీసులు నియంత్రించలేకపోయారు అంటూ సీరియస్ అయింది.