Tag Archives: devi nagallavi

Vishwaksen: విశ్వక్ విషయంలో భారీగా ట్రోల్ అవుతున్న దేవి నాగవల్లి… సారీ చెప్పనంటున్న విశ్వక్!

Vishwaksen: విశ్వక్ సేన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఆయన చేసిన ఫ్రాంక్ వీడియో అని అందరికీ తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లో భాగంగా ఈయన చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే అడ్వకేట్ అరుణ్ కుమార్ ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ ని సంప్రదించి ఫిర్యాదు చేశారు.

Vishwaksen: విశ్వక్ విషయంలో భారీగా ట్రోల్ అవుతున్న దేవి నాగవల్లి… సారీ చెప్పనంటున్న విశ్వక్!

ఇక ఈయన ఫిర్యాదు చేయడంతో వెంటనే విశ్వక్సేన్ అతని చిత్రబృందం అడ్వకేట్ తో మాట్లాడి ఈ విషయంపై రాజీ కుదుర్చుకున్నారు.ఇక విషయం ఇంతటితో అయిపోయిందనుకునెలోగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఈ విషయంపై డిబేట్ పెట్టి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే హీరో విశ్వక్ సేన్ ను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో హీరో కూడా తనపై  ‘F***’ అనే పదాన్ని వాడుతూ రెచ్చిపోయాడు .

Vishwaksen: విశ్వక్ విషయంలో భారీగా ట్రోల్ అవుతున్న దేవి నాగవల్లి… సారీ చెప్పనంటున్న విశ్వక్!

ఇక ఈ విషయం అన్న తర్వాత యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ ను గెటవుట్ అంటూ దారుణంగా అతనిని అవమాన పరిచారు. అయితే ఇది కూడా ఫ్రాంక్ అంటూ చాలామంది ఈ వీడియో కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ డిబేట్ ద్వారా దేవి నాగవల్లి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నారు. ఆమెకు ఇలా డిబేట్ కి వచ్చిన వారితో గొడవ పడటం సర్వసాధారణం. అయితే ఈ విషయంలో మాత్రం దేవి నాగవల్లి చాలా హైలెట్ అయ్యారు.

యాంకర్ పై దారుణమైన ట్రోలింగ్…

విశ్వక్సేన్ మాట్లాడిన పదం తప్పు అయినప్పటికీ తాను మాత్రం మీడియా ఎదుట క్షమాపణ చెప్పననీ అవసరమైతే ఒక సారి అనీ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫ్రాంక్ వీడియో చేసిన వ్యక్తి, ఈ ఫ్రాంక్ వీడియో పై కేసు వేసిన వ్యక్తి బాగానే ఉన్నప్పటికీ మధ్యలో ఎంటర్ అయిన దేవి నాగవల్లి మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు.