Vishwaksen: విశ్వక్ విషయంలో భారీగా ట్రోల్ అవుతున్న దేవి నాగవల్లి… సారీ చెప్పనంటున్న విశ్వక్!
Vishwaksen: విశ్వక్ సేన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఆయన చేసిన ఫ్రాంక్ వీడియో అని అందరికీ తెలిసిందే. విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్లో భాగంగా ఈయన చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే అడ్వకేట్ అరుణ్ కుమార్ ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్ ని సంప్రదించి ఫిర్యాదు చేశారు.
ఇక ఈయన ఫిర్యాదు చేయడంతో వెంటనే విశ్వక్సేన్ అతని చిత్రబృందం అడ్వకేట్ తో మాట్లాడి ఈ విషయంపై రాజీ కుదుర్చుకున్నారు.ఇక విషయం ఇంతటితో అయిపోయిందనుకునెలోగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఈ విషయంపై డిబేట్ పెట్టి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే హీరో విశ్వక్ సేన్ ను రెచ్చగొట్టేలా మాట్లాడటంతో హీరో కూడా తనపై ‘F***’ అనే పదాన్ని వాడుతూ రెచ్చిపోయాడు .
ఇక ఈ విషయం అన్న తర్వాత యాంకర్ దేవి నాగవల్లి హీరో విశ్వక్ ను గెటవుట్ అంటూ దారుణంగా అతనిని అవమాన పరిచారు. అయితే ఇది కూడా ఫ్రాంక్ అంటూ చాలామంది ఈ వీడియో కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ డిబేట్ ద్వారా దేవి నాగవల్లి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నారు. ఆమెకు ఇలా డిబేట్ కి వచ్చిన వారితో గొడవ పడటం సర్వసాధారణం. అయితే ఈ విషయంలో మాత్రం దేవి నాగవల్లి చాలా హైలెట్ అయ్యారు.
విశ్వక్సేన్ మాట్లాడిన పదం తప్పు అయినప్పటికీ తాను మాత్రం మీడియా ఎదుట క్షమాపణ చెప్పననీ అవసరమైతే ఒక సారి అనీ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫ్రాంక్ వీడియో చేసిన వ్యక్తి, ఈ ఫ్రాంక్ వీడియో పై కేసు వేసిన వ్యక్తి బాగానే ఉన్నప్పటికీ మధ్యలో ఎంటర్ అయిన దేవి నాగవల్లి మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…