Featured

Box Office : సినిమాలకు విలన్ గా మారిన టికెట్ రేట్స్… తగ్గేదేలే అని కలెక్షన్స్ కి చుక్కలు.!

Box Office : ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఒక మోస్తారు సినిమా తీయాలన్న కోట్లు కావాల్సిందే. ఇక పెద్ద సినిమాల సంగతి తెలిసిందే. ఒక సినిమాకు ఏకంగా సుమారుగా 300కోట్లు పెడుతున్నారు. ఇక గ్రాఫిక్స్ అవి ఇవి అంటే ఇంకా బడ్జెట్ పెరిగిపోతోంది. ఇక ఈ బడ్జెట్ కి ఇక ఆపై హీరోలు డైరెక్టర్లు వేల రెమ్యూనరేషన్లు తోడై బడ్జెట్ ఎక్కడికో పోతుంది. సినిమా బిజినెస్ లో లాభాలను కలుపుకుని కలెక్షన్స్ రూపంలో రాబట్టుకోవాలి. ఇక సినిమాపై బాగా అంచనాలు ఉండి ప్రీమియర్ లోనే మంచి టాక్ వస్తే మొదటి వారం వసూళ్లకు డోకా లేదు. టికెట్ రేట్లు ఎక్కువ కావడం వల్ల మొదటి వారం బాగానే వసూళ్లు వస్తాయి. సినిమా రెండు వారాలు హిట్ టాక్ తో రన్ అయిన తరువాత స్థిరంగా సినిమా థియేటర్లలో ఆడటమే ఇపుడు సినిమాకు పెద్ద పరీక్ష. మొదటి రెండు వారాలు సినిమా మంచి టాక్ ఉంటే ఆడుతుందిగాని, ఆ తరువాత కొనసాగడంలోనే ఉంది అసలు చిక్కు.

భయపెడుతోన్న టికెట్ రేట్లు…..

మొన్నా మధ్య చిరంజీవి గారు మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో సినిమాలు తీసినపుడు టికెట్ రేట్లు పెంచితే తప్పేంటని అన్నారు. హిట్ అయ్యే సినిమాల విషయంలో టికెట్ రేట్లు పెంచుకున్న వాళ్ళకు అది లాభామే కానీ ఒకవేళ ఒక పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడితే ఇక అంత టికెట్ రేట్ పెట్టి సినిమా చూసేదెవరు. సరిగా ఇపుడు ఆచార్య విషయంలో అదే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెరగడం వల్ల, ఇక ప్రీమియర్ షో నుండే నెగెటివ్ టాక్ రావడంతో ఇద్దరు మెగా సూపర్ స్టార్స్ ఉన్నా కూడా సినిమాకు కలెక్షన్స్ లేవు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ వాళ్ళు కుడా సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఈ టికెట్ రేట్ల విషయంలో మరో కోణం హిట్ అయి దూసుకుపోతున్న సినిమాకు రెండో సారి ప్రేక్షకుడు వెళ్ళలేని పరిస్థితి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండటమే కారణం. ఇలా మొత్తానికి రెండు సినిమాలలో విలన్ ఏమోకాని సినిమా కు సినిమాకు మాత్రం విలన్ గా టికెట్ రేట్లు తయారయ్యాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తులసి మాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి?

హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…

29 minutes ago

గూగుల్ AI హబ్ తర్వాత సింహాచలం దర్శనం… సీఎం, కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…

35 minutes ago

ఒకే రోజు మూడు మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్!

ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…

37 minutes ago

సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణం… ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…

40 minutes ago

వేసవిలో ఆసిడిటీ, గ్యాస్ బాధ పెరుగుతోందా? జీర్ణ సమస్యలు దూరం చేసే డైట్ చిట్కాలు!

వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…

48 minutes ago

వాస్తు ప్రకారం పూజా గది తప్పు దిశలో ఉంటే ఏం జరుగుతుంది?

ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…

55 minutes ago