Tag Archives: Dialogues in Balayya

Balakrishna: వైసీపీని టార్గెట్ చేస్తూ బాలయ్య సినిమాలో డైలాగ్స్…

Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర టిడిపి కార్యకర్తలు కూడా అధికారపక్షం మీద మాటలతో విరుచుకుపడుతూ ఉంటారు. అలాగే వైసిపి కార్యకర్తలు కూడా టిడిపి పార్టీ నేతలపై మాటల దాడికి దిగుతూ ఉంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎల్లప్పుడూ అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా అధికారపక్షం అధినేత అయిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఇప్పటికీ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు.హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ సినిమాలో బాలకృష్ణ నుంచి ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ చెప్పిన ఒక డైలాగ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్‌ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna: చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు….

ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ పేరు మీదుగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలకు వైయస్సార్ పేరు మార్చాడు. అంతేకాకుండా ఇటీవల ఎన్టీఆర్ పేరు మీదుగా ఉన్న హెల్త్ యూనివర్సిటీ ని కూడా వైఎస్ఆర్ పేరు మీద మార్చడంతో టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇలా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వారి చేతిలో ఉందని ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ప్రతిదాన్ని వైయస్సార్ పేరుగా మార్చారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చెప్పినట్లు నందమూరి అభిమానులు భావిస్తున్నారు.